Viral video: సంకల్పం ముందు అంగ వైకల్యం చిన్నబోయింది..కుటుంబం కోసం జొమాటో డెలివరీ బాయ్ గా..

Viral video: సంకల్పం ముందు అంగ వైకల్యం చిన్నబోయింది..కుటుంబం కోసం జొమాటో డెలివరీ బాయ్ గా..

సంకల్పం ముందు అంగవైకల్యం చిన్నబోయింది..కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించాలన్న అతడి పట్టుదల ముందు తలవంచింది. చెవులు వినపడవు, మాటలు రావు.. అయినా కమ్యూనికేషన్​అవసరం  అయిన డెలివరీ బాయ్​ గా శభాష్​ అనిపించుకున్నాడు ఈ కుర్రాడు. చదువు, తెలివితేటలు పుష్కలంగా ఈ యంగ్​ స్టర్​అంగవైకల్యాన్ని ఎడమకాలితో తన్ని మరీ  ఎవరికీ మేం తీసిపోం అని నిరూపించుకున్నాడు. తన కష్టాన్ని చూసి ఓ కస్టమర్​ సోషల్​ మీడియాలో షేర్​ చేసిన వీడియో  వైరల్​ అవుతోంది.. 

అది ఐపీఎల్​ సీజన్​ టైం..  చెన్నై ప్రాంతం..చెన్నై సూపర్​ కింగ్స్​, కోల్​కతా నైట్ రైడర్స్​ మ్యాచ్​టైం.. ఆ మ్యాచ్​ చూసేందుకు ఓ క్రికెట్​ అభిమాని చెన్నై వెళ్లాడు. ఓ హోటల్​ లో దిగాడు. ఫుడ్​ కోసం జొమాటో ఆర్డర్​ పెట్టాడు. ఫుడ్​ డెలివరీ బాయ్​ మేసేజ్​చూసిన  అతడు  ఆశ్చర్యానికి గురయ్యాడు. 

 ఆ క్రికెట్​ అభిమానికి ఫుడ్​ డెలివరీ చేసింది ఓ  మూగ, చెవిటి యువకుడు.. డెలీవరీకి ముందు  బాయ్​ నుంచి ఓ మెసేజ్​ వచ్చింది.. సర్​ నేను చెవిటీ మూగ.. నాకు మాటలు రావు , వినపడదు.. మీ  ఆర్డర్​ పికప్​ చేసుకున్నాను.. దయచేసి  నా మేసేజ్​ చూసుకోగలరు అని డెలివరీ బాయ్​ మేసేజ్​ చేశాడు. 

►ALSO READ | లడఖ్ ప్రజలపై ఆరెస్సెస్, బీజేపీ దాడి.. ఈ మారణహోమాన్ని ఆపండి: రాహుల్ గాంధీ

ఫుడ్​ఆర్డర్​ రిసీవ్​ చేసుకున్నాక కస్టమర్ డెలివరీ బాయ్​ కష్టాన్ని చూసి చలించిపోయాడు. చెవులు వినకపడకపోయినా, మాటలు రాకపోయినా ఆ యువకుడు కుటుంబం కష్టపడుతున్న తీరును మెచ్చుకున్నారు.  అతడు కష్టపడుతున్నాడు అని డబ్బులు ఇవ్వ బోతే.. వద్దు తిరస్కరించి ఆత్మాభిమానాన్ని చాటు కోవడం మరో విశేషం.

ఇక ఈవిషయాన్ని నెటిజన్లతో పంచుకుంటూ.. ఇలాంటి వారికి సాయం చేయండి.. అండగా  ఉండండి అని మేసేజ్​సెండ్​చేశాడు. నెటిజన్ల కూడా డెలివరీ బాయ్​ సంకల్పాన్ని మెచ్చుకున్నారు.