మూడు లీటర్ల పెట్రోల్ ఫ్రీ.. యజమానిపై డీలర్లు సీరియస్

మూడు లీటర్ల పెట్రోల్ ఫ్రీ.. యజమానిపై డీలర్లు సీరియస్

తిరువనంతపురం: దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. దీంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆటోడ్రైవర్లకు ఓ ఫ్యుయల్ బంక్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేరళలోని ఓ పెట్రోల్ స్టేషన్ ఆటోడ్రైవర్లకు మూడు లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. కర్నాటక, కేరళ బార్డర్‌లోని ఎన్మజాకే గ్రామ పంచాయతీలోని పెర్లాలోని పెట్రోల్ బంక్ యజమాని అబ్దుల్లా మ‌ధుమోల్  దాదాపు 311 మంది ఆటోవాలాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. 

ఒక్కొక్కరికి 3 లీటర్ల చొప్పున పెట్రోల్, డీజిల్‌‌ను ఉచితంగా అందించానని అబ్దుల్లా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఆఫర్‌ను ఆ ఊరిలోని ఆటోవాలాలే గాక దూర ప్రాంతాలకు చెందిన వారు కూడా వినియోగించుకున్నారని చెప్పారు. రెండ్రోజుల పాటు లక్ష విలువైన ఇంధనాన్ని అందించానని.. అయితే ఈ ఫ్రీ ఆఫర్‌ను నిలిపివేయాలని ఇతర డీలర్లు తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. లాక్‌డౌన్ వేళ ఇబ్బందుల్లో ఉన్న ఆటో డడ్రైవర్లను ఆదుకోవాలనే ఉద్దేశం త‌ప్ప బిజినెస్ ప్రమోషన్‌ కోసంకాదని స్పష్టం  చేశారు.