ఎన్ కౌంటర్లో 14 కు చేరిన మృతుల సంఖ్య.. 21 మంది మిస్సింగ్

ఎన్ కౌంటర్లో 14 కు చేరిన మృతుల సంఖ్య.. 21 మంది మిస్సింగ్

చత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలోని అడవుల్లో నిన్న(శనివారం)సాయంత్రం జరిగిన ఎన్ కౌంటర్లో చనిపోయిన జవాన్ల సంఖ్య 14 కు చేరింది. మావోల కాల్పుల్లో నిన్న ఐదుగురు జవాన్లు చనిపోయారని అధికారులు ప్రకటించగా ఇవాళ మరో 9 మంది డెడ్ బాడీలను గుర్తించారు అధికారులు. ఈ కాల్పుల్లో ఛత్తీస్ గఢ్ పోలీసులు, DRG జవాన్లు, CRPF జవాన్లు కలిపి... 31మందివరకు జవాన్లు గాయపడ్డారని తెలిపారు. ఐతే ఈ ఎన్ కౌంటర్ తర్వాత.. 21 మంది జవాన్లు కనిపించకుండా పోయారని లేటెస్ట్ గా చత్తీస్ గఢ్ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో  ఏడుగురు సీఆర్పీఎఫ్,కు చెందిన వారు. ఈ 21 మంది జవాన్లు ఎక్కడున్నారో తెల్సుకునేందుకు చత్తీస్ గఢ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నారు. రీఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ ను ఘటన స్థలానికి పంపించారు.  గాయపడిన 31మంది జవాన్లలో 23 మందిని బీజాపూర్ హాస్పిటల్ లో ఏడుగురిని రాయ్ పూర్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.