పెరుగుతున్న ఆఫ్ఘన్ బాంబ్ పేలుళ్ల మృతుల సంఖ్య

 పెరుగుతున్న ఆఫ్ఘన్ బాంబ్ పేలుళ్ల మృతుల సంఖ్య

ఆఫ్గనిస్తాన్‎లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న వరుస బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. నిన్న సాయంత్రం సంభవించిన వరుస పేలుళ్లతో కాందహార్ దద్దరిల్లింది. కాందహర్‎లోని ఇమామ్ బర్గా మసీదులో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 47కు చేరింది. దాదాపు 70 మందికి పైగా గాయపడ్డారు. శుక్రవారం కావడంతో కాందహార్‎లోని మసీదులో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రార్థనలు చేస్తుండగా ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ దాడికి తామే కారణమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఉగ్రదాడిని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (UNSC) తీవ్రంగా ఖండించింది. బాధితుల కుటుంబాలకు భద్రతామండలి సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదమనేది అంతర్జాతీయ శాంతి, భద్రతలకు తీవ్ర ముప్పుగా మారిందని వారు పేర్కొన్నారు.