
ఆదిలాబాద్, వెలుగు: వర్షాల కారణంగా ఇటీవల కూలిపోయిన ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఏ, బీ సెక్షన గదుల్లోని శిథిలాలను తొలగిస్తున్నారు. ఆర్అండ్ బీ అధికారులు కూలీలను పెట్టి స్లాబ్, ఇతర దెబ్బతిన్న వస్తులను కూలీలతో తీసివేయిస్తున్నారు. ఇప్పటికే నిపుణుల కమిటీ కలెక్టరేట్ భవాన్ని పరిశీలించి డీఎన్డీటీ పరీక్షలు చేసింది. ఫైనల్ రిపోర్ట్ వచ్చే వరకు మిగతా సెక్షన్లను వినియోగించుకునున్నారు. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు సోమవారం నుంచి పలు శాఖలకు వెళ్లే రూట్లలో మార్పులు చేశారు. కలెక్టరేట్లోని సీపీవో, డీసీవోకు వచ్చే వారికోసం
ఎస్బీఐ బ్యాంకు వైపు నుంచి ట్రెజరీ కార్యాలయానికి ప్రవేశం కల్పించారు. వెనుక నుంచి కేవలం డీపీఆర్వో కార్యాలయం, ఆధార్ కేంద్రానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అధికారులు, ప్రజలు మెయిన్ గేట్ నుంచి కలెక్టరేట్లోకి ప్రవేశించకూడదని కలెక్టర్ సూచించారు.