డెక్కన్ స్పోర్ట్స్ మాల్ బిల్డింగ్ కూల్చేది ఇయ్యాల్నే

డెక్కన్ స్పోర్ట్స్ మాల్ బిల్డింగ్ కూల్చేది ఇయ్యాల్నే
  • ఎస్కే మల్లు ఏజెన్సీకి టెండర్​ను​ అప్పగించిన బల్దియా
  • రెండ్రోజుల పాటు కొనసాగనున్న పనులు

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్​పరిధి నల్లగుట్టలో అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ స్పోర్ట్స్ మాల్ బిల్డింగ్​ను కూల్చేందుకు జీహెచ్ఎంసీ రెడీ అయింది. గురువారం నుంచి కూల్చివేత పనులు ప్రారంభించనుంది. ఉదయం పూట రిపబ్లిక్ డే వేడుకల్లో బిజీగా ఉండనున్న అధికారులు మధ్యాహ్నం తర్వాత పనులు స్టార్ట్​చేయనున్నారు. రెండు రోజుల పాటు కూల్చివేత కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

ఈ పనులకు రూ.33 లక్షల 86 వేల 268తో బుధవారం టెండర్లు ఆహ్వానించగా 8 ఏజెన్సీలు పాల్గొన్నాయి. ఎస్కే మల్లు అనే ఏజెన్సీ 20 లక్షల93వేల 390 రూపాయలకు కోట్​ చేసి టెండర్​ను దక్కించుకుంది. కూల్చివేత టైంలో చుట్టుపక్కల ఇండ్లు డ్యామేజ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నామని బల్దియా అధికారులు స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు చుట్టుపక్కల రోడ్లను క్లోజ్​చేయనున్నారు. కాగా ఇంతవరకు బిల్డింగ్​లో మిగతా ఇద్దరి  ఆచూకీ దొరకలేదు.