సంగారెడ్డి టౌన్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో నిర్వహించే కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ20 ఉమ్మడి మెదక్ జిల్లా జట్ల ఎంపిక ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్‌రెడ్డి సోమవారం తెలిపారు.
ఈనెల 17న మెదక్ జిల్లా జట్టు ఎంపిక సంగారెడ్డి లోని జూబ్లీ క్లబ్ ప్రాంగణంలో గల ఎమ్మెస్ అకాడమీలో ఉదయం 10 గంటలకు జరుగుతుందన్నారు. 18 న సిద్దిపేట జిల్లా జట్టు ఎంపిక సిద్దిపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ క్రికెట్ గ్రౌండ్లో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్‌తో హాజరు కావాలని సూచించారు.
