
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూన్ 6వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 11
పోస్టులు: సీనియర్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ 01, సీనియర్ డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ 01, పైలట్(మెరైన్) 09.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు షిప్పింగ్ మంత్రిత్వశాఖ జారీ చేసిన సర్టిఫికెట్ లేదా సమాన విద్యార్హతను కలిగి ఉండాలి.
వయోపరిమితి: సీనియర్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ 45 ఏండ్లు, సీనియర్ డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ 42 ఏండ్లు, పైలట్(మెరైన్) 40 ఏండ్లు మించకూడదు.
అప్లికేషన్: ఆన్లైన్/ ఆఫ్లైన్ ద్వారా.
ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్: జూన్ 05.
ఆఫ్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్: జూన్ 16. ఆఫ్లైన్ అప్లికేషన్లను ది సెక్రటరీ, దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, పోస్ట్ బ్యాగ్ నెంబర్ 50, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ బిల్డింగ్, ఠాగూర్ రోడ్, గాంధీదామ్(కచ్చి), గుజరాత్.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.