
డెహ్రాడూన్: టీడీపీ నేత, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తరఖాండ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన సోదరి వేదవతి కుమారి (48) మృతి చెందారు. ఎంపీ లక్ష్మీ నారాయణ బావ భాస్కర్ (51) గాయాలతో బయటపడ్డారు. చికిత్స నిమిత్తం భాస్కర్‌ను ఎయిమ్స్ రిషికేష్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎంపీ లక్ష్మీ నారాయణ హుటాహుటిన రిషికేష్ బయలు దేరారు. కాగా, ఎంపీ లక్ష్మీ నారాయణ సోదరి వేదవతి, ఆమె భర్త గురువారం (మే 8) ఉత్తరఖాండ్‌లోని గంగోత్రికి ప్రైవేట్ హెలికాప్టర్లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ALSO READ | వైసీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో.. 11 మందికి జీవిత ఖైదు
ఉత్తర కాశీ అడవుల్లో వీరు ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాదాని గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి కారణం ప్రతికూల వాతావరణమా లేక సాంకేతిక సమస్యనా అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.