డెర్బీ (ఇంగ్లండ్): ఫామ్‌లో ఉన్న దీపక్ హుడా (37 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59) హాఫ్ సెంచరీతో మెరవడంతో.. డెర్బిషైర్‌తో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 వామప్ మ్యాచ్‌లో ఇండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. 151 రన్స్ టార్గెట్‌ను ఇండియా 16.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. హుడాతో పాటు సూర్యకుమార్ (36 నాటౌట్), శాంసన్ (38) రాణించారు. తొలుత ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ చెరో 2 వికెట్లు తీయడంతో.. డెర్బిషైర్ 20 ఓవర్లలో 150/8 స్కోరు చేసింది. వేని మాడ్సెన్ (28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆదివారం రెండో వామప్ జరుగుతుంది.
