ఐడీబీఐ బ్యాంక్​ అమ్మేస్తాం : దీపమ్​ సెక్రటరీ

ఐడీబీఐ బ్యాంక్​ అమ్మేస్తాం : దీపమ్​ సెక్రటరీ

పనులు సాగుతున్నాయ్​ : దీపమ్​ సెక్రటరీ

న్యూఢిల్లీ :
ఐడీబీఐ బ్యాంక్​లో ప్రభుత్వ వాటా అమ్మకం పనులు చురుగ్గానే సాగుతున్నాయని, దీనిని వాయిదా వేసే ఆలోచనేదీ లేదని దీపమ్​ సెక్రటరీ తుహిన్​కాంత పాండే స్పష్టం చేశారు. ఐడీబీఐ బ్యాంక్​ వాటా అమ్మకం వాయిదా పడనుందంటూ వచ్చని వార్తలలో నిజం లేదని కొట్టిపారేశారు. ఐడీబీఐ బ్యాంక్​లో ప్రభుత్వం, ఎల్ఐసీలకు ఉన్న వాటాలో  61 శాతం వాటా అమ్మకానికి పెట్టారు.

ఈ వాటా అమ్మడానికి ఎక్స్​ప్రెషన్​ ఆఫ్​ ఇంటరెస్ట్​ (ఈఓఐ)లను పిలిచారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ఈ ఏడాది జనవరి నెలలో తమ ఈఓఐలను సబ్మిట్​ చేశారు. ఈ వాటా అమ్మకం తర్వాత ఐడీబీఐ బ్యాంక్​లో ఎల్​ఐసీ, ప్రభుత్వ వాటా 34 శాతానికి తగ్గిపోతుంది. వచ్చిన బిడ్స్​ను ఆర్​బీఐ, ప్రభుత్వం పరిశీలిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్​, ఆర్​బీఐ నుంచి ప్రోపర్​ క్లియరెన్స్​లు అవసరమని తుహిన్​ కాంత పాండే​ పేర్కొన్నారు. 2023–24 ఫైనాన్షియల్​ ఇయర్​ మధ్య నాటికి ఈ ట్రాన్సాక్షన్​ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.