Diwali 2024:  దీపావళి పండుగ అక్కడ​అలా... ఇక్కడ ఇలా...

Diwali 2024:  దీపావళి పండుగ అక్కడ​అలా... ఇక్కడ ఇలా...

దీపావళి అంటే నక్షత్రాలన్నీ దివినుంచి భువికి దిగివచ్చేరోజు. ప్రతి ఇంటా నవ్వుల దీపాలు వెలిగేరోజు. పిల్లలతోపాటు.. పెద్దలూ.. పిల్లలుగా మారి సరదాగా గడిపేరోజు. మతాలకతీతంగా దేశం మొత్తం ఈ కాంతుల పండుగని ఘనంగా జరుపుకుంటారు. చీకటిని వెలుగులు తరిమి కొట్టడానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం ఒక్కటే దీని కాన్సెప్ట్. కాకపోతే ఈ పండుగను జరుపుకునే తీరు కొన్ని ప్రాంతాల్లో కాస్త భిన్నంగా ఉంటోంది. ఇప్పుడు  ఏ  ప్రాంతంలో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. . . 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు మిన్నంటుతాయి.. దీపాలతో ఇంటిని అలంకరించుకుంటారు. సాయంవేళల్లో.. లక్ష్మీ పూజను వైభవంగా నిర్వహిస్తారు.     టపాసుల శబ్దాలు మోత మోగుతాయి.  కొన్ని చోట్ల కూడళ్లలో రావణదహనం లాంటి కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళి రోజున ప్రతి ఇంటి ముందు దీపాలు కొలువుతీరుతాయి. అసలు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపం అంటే త్రిమూర్తిస్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. ఇందులోని ‘ఎర్రని’ కాంతి బ్రహ్మదేవునికి, ‘నీలి’ కాంతి శ్రీమహావిష్ణువుకి, ‘తెల్లని’ కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు. సాధారణంగా అమావాస్య రోజు రాత్రి చీకటి మయంగా ఉంటుంది. ఈ వెలుగులతో చీకట్లను పారద్రోలినట్టే.. మనలో ఉండే అజ్ఞానాన్ని తరిమికొట్టడమే దీని వెనుకున్న ఉద్దేశం. దీపావళి రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుందని.. అందుకే అమ్మవారికి దీపాలతో ఆహ్వానం పలుకుతారని చెబుతారు.

నరకాసుర వధ (గోవా) : దీపావళి పండుగ జరుపుకోవడానికి కారణంగా చెప్పుకునే నరకాసుర శ్రీకృష్ణుడి విజయానికి సంకేతంగా ... గోవా ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు బరువుకుంటారు. ఉదయం లేచి స్నానం, పూజలు చేస్తారు. ఆపై ముఖ్యఘట్టం నరకాసురుడి దిష్టిబొమ్మ దహనం చేస్తారు. దిష్టిబొమ్మని వీధుల్లో ఉరేగించి చివరికి ఒక ప్రదేశంలో దహనం లేదా శిరస్సు ఖండన చేస్తారు. ఈ తతంగం అంతా సూర్యో దయానికి ముందే జరుగుతుంది.

శివాజీ కోట (మహారాష్ట్ర) : దీపావళికి వారం రోజుల ముందే  మహారాష్ట్రలో దీపావళి సందడి షురూ అవుతుంది. పిల్లలు బురదతో కోటల్ని తయారు చేస్తారు. ఆ కోటల చుట్టూరా పచ్చని మొక్కల్నినాటుతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి మడుగులో వీటిని ఉంచుతారు. పండుగకి గ్రీన్ కోటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. శివాజీ జీజాబాయి ప్రతిమలు, సైన్యం, ఆయుధాల బొమ్మల్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఛత్రపతి శివాజీ విజయాలకు ప్రతీకగా దీపావళికి ఈ కోటల్ని ఏర్పాటు చేయటం అనవాయితీగా వస్తోంది. ఇప్పుడది చరిత్ర పాఠాలు బోధించేందుకు మార్గాన్ని సులభతరం చేసింది. రాత్రిపూట విద్యుత్ దీపాల అలంకచి ఇవి మిరుమిట్లు గొలుపుతుంటాయి..

తంబీల స్పెషల్ ( తమిళనాడు): నరక చతుర్దశినే తమిళ ప్రజలు దీపావళికి ప్రామాణికం గా తీసుకుంటారు. పొద్దున్నే లేచి కుండల్లో నీటిని వేడి చేసి ఇంటిని శుభ్రం చేస్తారు. రంగురంగుల ముగ్గులతో ప్రాంగణాన్ని అందంగా తీర్చి దిద్దుతారు. తర్వాత కుండలకు అలంకరణ చేస్తారు. ఇప్పుడు కుండల స్థానంలో బాయిలర్లను ఉపయోగిస్తున్నారు. శీకాకాయతో తలంటు స్నానం మరో ప్రత్యేకత.   ఇంటి పెద్ద మిగతా సభ్యుల్ని కుర్చీల్లో కూర్చోబెట్టి వరుసపెట్టి తలస్నానం చేయిస్తాడు. తర్వాత దేవకీ నువ్వుల నూనె ఉసిరికాయలు మిఠాయిలు సమర్పిస్తారు .  జీర్ణశక్తిని ఆరోగ్యంగా ఉంచే దీపావళి లేహ్యాన్ని తింటారు. దీపావళికి తంబీలు నాజ్​- కూడా బాగిస్తారు.

ALSO READ : Deepavali 2024:  దీపావళి పండుగ వెనుక పురాణ కథలు ఇవే..


ఘరోందాస్  ( ఉత్త రప్రదేశ్, జార్ఖండ్, బిహార్) : పురాణాల ప్రకారం రాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత తిరిగి అయోధ్యకు వస్తాడు. ఆ రోజును రాజ్య ప్రజలు దీపాలు వెలిగించి పండుగలా జరుపుకుంటారు. ఉత్త రప్రదేశ్, జార్ఖండ్, బిహార్ రాష్ట్ర ప్రజలు దీపావళి వెనుక ఉన్న కథ ఇదేనని నమ్ముతారు. పండుగ రోజున ఇళ్లలో బురదతో ఇంటి ప్రతిమలను ఏర్పాటు చేస్తారు. ఈ సంప్రదాయాన్ని 'ఘరోందాస్' అంటారు. అంటే దేవుడికి స్వాగతం. పలకడం అని అర్థం. కాలక్రమేణా ఇప్పుడు పిల్లలు ఆంక్షను బొమ్మల కొలువుగా మార్చేస్తున్నారు. బురదకి బదులుగా ధర్మకోల్ షీట్లు, ప్లాస్టిక్, చెక్కలతో చేసిన రెడీమేడ్ ఇళ్లను మార్కెట్లో అమ్ముతున్నారు కొందరు...

బుద్ధి దీపావళి ( హిమాచల్​ ప్రదేశ్​): దీపావళి పండుగ నెలరోజులు తర్వాత  హిమాచల్ ప్రదేశ్లో వేడుకలు చేసుకుంటారు. దీనిని బుద్ధి దీపావళి అని పిలుస్తుంటారు. రాముడు వనవాసం ముగిసి అయోధ్యకి వచ్చారు.. ఆ సమాచారం నెలరోజులకు ఇక్కడి ప్రజలకు తెలిసిందట అప్పటి నుంచి తరతరాలుగా ఆలస్యంగా ఇక్కడి ప్రజలు దీపావళిని జరుపుకుంటున్నారు. పెద్ద తాడుతో మానవహారంగా ఏర్పడి అక్కడి ప్రజలు నృత్యాలు చేస్తారు. బయటివాళ్లకు ఇందులో అనుమతి ఉండదు. జంతు బలి కొన్నేళ్లుగా సంప్రదాయం గా కొనసాగింది. అయితే హైకోర్టు ఆదేశాలతో కొబ్బరికాయ కొట్టడంతోనే ఇప్పుడు సరిపెడు తున్నారు.