
బాలీవుడ్ స్టార్ కపుల్స్లో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే ముందువరుసలో ఉంటారు. ఈ జంట 2018లో పెళ్లి చేసుకుని, 2024 సెప్టెంబర్‌లో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. వీరి పాపకు “దువా” అని పేరు ప్రకటించి, అందరి ఆశీస్సులు తీసుకున్నారు.
అయితే, ఈ జంట తమ కూతురు “దువా” పేస్ని రివీల్ చేయకుండా ఇన్నాళ్లు మెయింటేన్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే “నో ఫోటో పాలసీ”ని అనుసరిస్తూ, సోషల్ మీడియాకి చిక్కకుండా పలు జాగ్రత్తలు తీసున్నారు.
ఎట్టకేలకు ఈ జంట దీపావళి పండగని పురస్కరించుకుని తమ ముద్దుల డాటర్ దువాని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ దివాళిని తమ కూతురితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ALSO READ : బర్త్ డేకి ముందే బ్లాస్ట్.. ప్రభాస్ హను మూవీ అప్డేట్ వచ్చేసింది..
ప్రస్తుతం “దువా” ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో దీపికా, దువా ఇద్దరూ మెరూన్ కలర్ దుస్తులు ధరించగా.. రణవీర్ సింగ్ తెల్లటి కుర్తా పైజామాలో ధరించి అందమైన చిరునవ్వులతో నెటిజన్లని కట్టిపడేస్తున్నారు. ఈ క్రమంలో వీరి ఇరువురి ఫ్యాన్స్తో పాటుగా.. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు.. బేబీ దువాకి బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు. “ ఓ మై గాడ్.. దీపికా డాటర్ క్యూట్ అనార్కలి.. చూడచక్కగా ఉందని" కామెంట్స్ పెడుతున్నారు.ఇకపోతే, “దువా” అనగా ప్రార్థన అని అర్ధం.
గతనెల సెప్టెంబర్‌లోనే దువా ఫస్ట్ బర్త్ డేని దీపికా రణవీర్ జరుపుకున్నారు. ఈ విషయాన్ని దీపికా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ ఫోటోలు షేర్ చేసింది. “నా ప్రేమ భాష? నా కూతురి మొదటి పుట్టినరోజు!” అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే, ఆ టైంలో దువా పేస్ ని రివీల్ అవ్వకుండా జాగ్రత్త పడింది దీపికా!
ఇకపోతే.. దీపికా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్గా మారిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే, ఇటీవలే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్', నాగ్ అశ్విన్ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి దీపికా వైదొలగడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నిర్ణయాల వెనుక ఆమె డిమాండ్ చేసిన '8 గంటల ఫిక్స్‌డ్ వర్కింగ్ షిప్ట్' విషయమే ప్రధాన కారణంగా వినిపిస్తోంది.
అయితే, ఈ మొత్తం వ్యవహారం సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రస్తుతం అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ లో దీపికా నటిస్తుంది. హిందీలో షారుఖ్ సరసన మరో సినిమా చేస్తుంది. మరోవైపు ఆదిత్య ధార్ రాబోయే చిత్రం, ఫర్హాన్ అక్తర్ డాన్ 3లో రణవీర్ సింగ్ నటిస్తున్నారు.