Spirit: స్పిరిట్ హీరోయిన్కి రూ.20కోట్ల రెమ్యునరేషన్.. ప్రభాస్కు ధీటైన బ్యూటీనే దింపిన సందీప్ రెడ్డి!

Spirit: స్పిరిట్ హీరోయిన్కి రూ.20కోట్ల రెమ్యునరేషన్.. ప్రభాస్కు ధీటైన బ్యూటీనే దింపిన సందీప్ రెడ్డి!

బాలీవుడ్లో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్స్లో దీపికా పదుకొణె (Deepika Padukone)ఒకరు. నార్త్లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్గా మారిపోయింది. గతేడాది ప్రభాస్తో కల్కి 2898 AD సినిమా చేసి అద్భుత విజయం సాధించింది. అయితే, ఈ సారి ప్రభాస్తో ఫుల్ లెన్త్ రోల్లో కనిపించే ఛాన్స్ ఉందని సినీ వర్గాల సమాచారం. 

ప్రభాస్ ప్రస్తుతం సందీప్ వంగా డైరెక్షన్లో స్పిరిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, అలియాభట్, రష్మిక మందన్నతో పాటు పలువురు పేర్లు వినిపించినా ఎవరినీ ఖరారు చేయలేదు. అయితే, లేటెస్ట్గా దీపికా పదుకొనే పేరు తెరపైకి వచ్చింది.

ఇది అభిమానులకు కిక్ ఇచ్చే వార్త అయినప్పటికీ.. మరో షాకింగ్ టాక్ కూడా వినిపిస్తోంది. అదేంటంటే.. స్పిరిట్ సినిమా కోసం దీపికా పదుకునే రూ.20కోట్ల రెమ్యునరేషన్ను డిమాండ్ చేసిందని సమాచారం. మేకర్స్ కూడా అంతమొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో ఒక్కో సినిమాకు రూ.12 నుండి రూ.15 కోట్ల వరకు తీసుకున్న దీపికా.. స్పిరిట్ కోసం రూ.20 కోట్లు తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. 

ఇకపోతే సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. 'యానిమల్' మూవీలో సందీప్ డైరెక్షన్కి వందకి వంద మార్కులు పడ్డాయి. రణ్ బీర్ చూపించిన విధానంకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాంటి ప్రభాస్ని ఎలా చూపించబోతున్నాడనే చర్చయితే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఏక్షణమైనా ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.