ముంబై డ్రగ్స్ కేసులో దీపికకు సమన్లు?   

ముంబై డ్రగ్స్ కేసులో దీపికకు సమన్లు?   

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతిపై జరుగుతున్న విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. దీనిలో డ్రగ్స్‌ కోణాన్ని దర్యాప్తు చేసేందుకు నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (NCB) రంగంలోకి దిగింది. విచార‌ణ‌లో రియా చ‌క్ర‌వ‌ర్తి ప‌లువురు హీరోయిన్ల పేర్లు చెప్పింది.

ఇందులో పలువురు బాలీవుడ్‌ నటీనటుల పేర్లు బయటకు వచ్చాయి. ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకుణెకు కూడా డ్రగ్స్ వినియోగం కేసులో ఎన్సీబీ సమన్లు ఇవ్వనున్నట్టు సమాచారం. అంతేకాకుండా శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌లకు కూడా సమన్లు జారీ అవుతాయని తెలుస్తోంది.

లేటెస్టుగా టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేశ్ బాబు స‌తీమ‌ణి, న‌టి న‌మ్ర‌త శిరోద్క‌ర్ పేరు కూడా జాతీయ మీడియాలో తెర‌పైకి వ‌చ్చింది. టాలెంట్ మేనేజ‌ర్ జ‌య సాహాతో న‌మ్ర‌త డ్ర‌గ్స్ గురించి చాటింగ్ చేసిన‌ట్టు సమాచారం. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు జ‌య‌సాహాను విచారిస్తున్న క్ర‌మంలో న‌మ్ర‌త శిరోద్క‌ర్ పేరు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు బాలీవుడ్ న‌టి దియా మీర్జా పేరు కూడా లైమ్ లైట్ లోకి వ‌చ్చింది. 2019లో దియా డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టుగా గుర్తించిన‌ట్టు స‌మాచారం. దీంతో NCB అధికారులు దియామీర్జా, ఆమె మేనేజ‌ర్ ను విచార‌ణ‌కు పిలిచే అవ‌కాశ‌మున్న‌ట్టు తెలుస్తోంది.

NCB విచారణలో రియా చక్రవర్తి 25 మంది పేర్లను చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత సినీ ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు బయటకు వచ్చిన పేర్లలో కరీనా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు కూడా ఉన్నాయి.