కల్కి కోసం దీపికా భారీ రెమ్యునరేషన్.. కెరీర్లోనే హైయెస్ట్

కల్కి కోసం దీపికా భారీ రెమ్యునరేషన్.. కెరీర్లోనే హైయెస్ట్

నార్త్ బ్యూటీ దీపికా పదుకొణె(Deepika Padukone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయింది. ఇక ఈ భామ చేసే అందాల ఆరబోతకు అడ్డేలేదు. గత సంవత్సరం పఠాన్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇటీవల ఫైటర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. దీంతో ఆమె తరువాతి సినిమాలపై అదే రేంజ్ లో బజ్ క్రియేట్ అవుతోంది.

ఇక దీపికా ప్రస్తుతం చేస్తున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్టులలో ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898 AD మూవీ ఒకటి. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కుతున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా కల్కి సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈ సినిమా కోసం దీపికా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోందట.     

ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్‌ ప్రకారం.. కల్కి సినిమా కోసం దీపికా ఏకంగా రూ.20 కోట్లు పోరితోషికంగా అందుకుంటుందట.  ఇది దీపికా కెరీర్‌లోనే హైయెస్ట్ అవడం విశేషం. గతంలో ఒక్కో సినిమాకు రూ.12 నుండి  రూ.15 కోట్ల వరకు తీసుకున్న దీపికా.. కల్కి కోసం రూ.20 కోట్లు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ న్యూస్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చర్చనియ్యాంశంగా మారింది. ఇక కల్కి 2898 AD సినిమా విషయానికి వస్తే.. సైంటిఫిక్‌ ఫ్యూచరిస్ట్‌ ఫిల్మ్‌ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ వంటి స్టార్స్ కీ రోల్స్ చేస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.