దీపికా పదుకొనె మూవీ ఇన్‌స్పిరేషన్!: యాసిడ్ దాడి బాధితులకు పెన్షన్

దీపికా పదుకొనె మూవీ ఇన్‌స్పిరేషన్!: యాసిడ్ దాడి బాధితులకు పెన్షన్

భాదితుల్ని జీవితాంతం కుమిలిపోయేలా చేసే దాడి యాసిడ్ అటాక్. ఉన్మాదంలో ప్రేమ పేరుతో వేధించే వాళ్లో.. మరో రకమైన దుర్మార్గులో.. చేసిన దాడి నుంచి ప్రాణాలతో బయటపడినా ఆ తర్వాత సమాజంలో ఓ రకమైన వివక్ష ఎదురవుతోంది. నలుగురిలోకి వచ్చినప్పుడు బాధిత మహిళల్ని చూసి మొహం చిట్లించుకునే వాళ్లను చూస్తే డిప్రెషన్‌ బారిన పడుతున్న బాధితులు కూడా ఉన్నారు. ఇలాంటి ఓ సామాన్య మహిళ లక్ష్మీ అగర్వాల్ తనపై జరిగిన యాసిడ్ అటాక్ నుంచి కోలుకుని, తనలాంటి వారికి అండగా పోరాడిన తీరు గురించి తెరకెక్కిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె మూవీ ‘ఛపాక్’ ఇటీవలే జనాల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతోంది.

ఇప్పుడు ఓ రాష్ట్ర ప్రభుత్వాన్నే కదిలించింది దీపికా సినిమా. యాసిడ్ అటాక్‌ బాధితులకు అండగా నిలుస్తూ ఓ అడుగు ముందుకు పడేలా చేసింది. సమాజంలో వివక్షకు ఎదురు నిలిచి తమ జీవితాన్ని ముందుకు సాగించాలని ధైర్యంగా కదిలేలా ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం వారికి సాయం చేయాలని భావిస్తోందని చెప్పారు ఆ రాష్ట్ర మంత్రి రేఖా ఆర్య. యాసిడ్ అటాక్ బాధితులకు ప్రతి నెలా రూ.7 వేల నుంచి పది వేల వరకు పెన్షన్ అందించాలన్న ప్రతిపాదనపై చర్చిస్తున్నామని తెలిపారు.  వారు స్వతంత్రంగా జీవనం సాధించేందుకు, ఆర్థికంగా ఈ చిన్న చేయూత అందించాలని అనుకుంటున్నామన్నారు. ఈ సాయంతో వారికి ఎంతో కొంత మేలు జరుగుతుందని, దీన్ని త్వరలోనే అమలులోకి తెస్తామని చెప్పారు.

More News:

నా 20 కోట్లు నాకివ్వండి: సుప్రీంలో కార్తీ చిదంబరం పిటిషన్

గొంతులో ఇరుక్కున్న చికెన్ బొక్క : ఉక్కిరిబిక్కిరైన బాలుడు