డీఆర్డీవో కరోనా మందు వచ్చేస్తోంది

డీఆర్డీవో కరోనా మందు వచ్చేస్తోంది

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ల ట్రీట్​మెంట్​లో కీలకం కానున్న డీఆర్డీవో ‘2డీజీ (2డీఆక్సీ డీగ్లూకోజ్)’ మందును సోమవారం ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ రిలీజ్ చేయనున్నారు. ఢిల్లీలోని పలు దవాఖాన్లకు 10 వేల ప్యాకెట్ల(డోసుల)ను ఆయన పంపిణీ చేయనున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ఈ మందును హైదరాబాద్​కు చెందిన రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఉత్పత్తి చేస్తోంది. ఈ మందు ఎమర్జెన్సీ వాడకానికి డీసీజీఐ ఇదివరకే అనుమతి ఇచ్చింది. ఈ మందు ఫేజ్ 2, 3 క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయి. పొడి రూపంలో ఉండే ఈ మందును నీటిలో కలుపుకొని తాగవచ్చు.  2డీజీ మందుతో పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం తగ్గుతుందని, హాస్పిటల్ లో ఉండాల్సిన రోజులూ తగ్గుతాయని చెప్తున్నారు. ఇది అన్ని వయసుల వారికి పని చేస్తుందని, డ్రగ్​ తీసుకున్న పేషెంట్లలో రెండు మూడు రోజుల్లోనే తేడా కనిపించిందని సైంటిస్టులు చెప్తున్నారు.