మువ్వన్నెల జెండా ఎగరేసిన రాజ్నాథ్ సింగ్

మువ్వన్నెల జెండా ఎగరేసిన రాజ్నాథ్ సింగ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 76 వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని తన నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకున్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. తన నివాసం దగ్గర త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు రాజ్ నాథ్ సింగ్. త్రివిధ దళాల సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.  ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు ఆయన నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో రక్షణశాఖకు చెందిన ముఖ్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

రక్షణ మంత్రి నివాసంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తూ పౌరుల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. వేడుకల్లో  పలువురు చిన్నారులు అతిథులుగా పాల్గొన్నారు.