సర్కారు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలి : డిగ్రీ కాలేజీ లెక్చరర్ల సంఘం డిమాండ్ 

సర్కారు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలి : డిగ్రీ కాలేజీ లెక్చరర్ల సంఘం డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లోనూ దోస్త్ స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల గెజిటెడ్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోపి, సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం ప్రైవేట్ కాలేజీలకు మాత్రమే స్పాట్ అడ్మిషన్ల అవకాశం ఇవ్వడం సరికాదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది స్టూడెంట్లతో పాటు సర్కారు కాలేజీలకూ నష్టమేనన్నారు.

దోస్త్ ప్రక్రియలో ఈ నెల 13, 14 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. జీవో 15 ప్రకారం నాన్ లోకల్ కింద గుర్తించిన స్టూడెంట్లకు సీట్లు ఇవ్వలేదని, దీంతో అందరికి స్పాట్ అడ్మిషన్లలో మాత్రమే అవకాశం ఉందని చెప్పారు. సర్కారు కాలేజీలకు కూడా స్పాట్ అవకాశం ఇస్తే, ఆయా కాలేజీల్లో సీట్లు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కొంతమంది అధికారులు సర్కారు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల నిర్వహణకు అడ్డుపడుతున్నారని, ఇప్పటికైనా వారి వైఖరి మార్చుకోవాలని కోరారు.