ప్రగతి భవన్ ముందు డిగ్రీ విద్యార్థుల ఆందోళన

ప్రగతి భవన్ ముందు డిగ్రీ విద్యార్థుల ఆందోళన

బుధ‌వారం మ‌ధ్యాహ్నం ప్రగతి భవన్ ముందు ఆందోళనకర వాతావరణం చోటు చేసుకుంది. ప్రగతిభవన్‌ను ఎన్‌ఎస్‌యూఐ(NSUI) విద్యార్థులు ముట్టడించి… డిగ్రీ సెమిస్టర్‌ ఫీజులు రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, మంత్రి సబితాఇంద్రారెడ్డికి విద్యార్థులు ఈ విష‌యంపై విజ్ఞప్తి చేశారు. ఒక్కో సెమిస్టర్ కి ప్రభుత్వం రూ.1600 ఫీజు వసూళ్లు చేస్తున్నద‌ని ,కరోనా ప్రభావంతో తమ కుటుంబాలు ఆర్థిక సమస్యల్లో ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.