కామారెడ్డి ఎంసీహెచ్‌‌‌‌ పనుల్లో డిలే

కామారెడ్డి ఎంసీహెచ్‌‌‌‌ పనుల్లో డిలే
  • నాలుగేళ్లుగా సాగుతున్న నిర్మాణ పనులు 
  • సెంట్రల్‌‌‌‌ వాటా వచ్చినా.. స్టేట్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ కాలే

గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన మాత, శిశు సంరక్షణ హాస్పిటల్‌‌‌‌ (ఎంసీహెచ్) నిర్మాణ పనులు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. హెల్త్ మినిస్టర్ విజిట్ చేసి పనులు స్పీడప్‌‌‌‌ చేయాలని ఆఫీసర్లను ఆదేంశించి 6 నెలలైనా ఇంకా పూర్తి కాలేదు. నిధుల కొరత వల్లే పనులు ఆగినట్లు తెలుస్తోంది.

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి, బాన్సువాడకు ఐదేళ్ల కింద మాత శిశు సంరక్షణ కేంద్రాలు (ఎంసీహెచ్‌‌‌‌లు​) శాంక్షన్​ అయ్యాయి. మొదట బాన్సువాడకు 100 బెడ్స్, కామారెడ్డికి 50 బెడ్స్‌‌‌‌తో  శాంక్షన్ ​చేశారు. అయితే ఇక్కడి ప్రజాప్రతినిధులు అప్పట్లో హెల్త్ మినిస్టర్, ఉన్నతాధికారులను సంప్రదించి విజ్ఞప్తి చేయడంతో కామారెడ్డికి కూడా 100 బెడ్స్‌‌‌‌కు పెంచారు. ఇందులో భాగంగా హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణంతో పాటు ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం రూ.17 కోట్ల మంజూరు చేశారు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్​వాటా రూ.7 కోట్లు కాగా, స్టేట్ గవర్నమెంట్ వాటా రూ.10 కోట్లు. బిల్డింగ్​నిర్మాణానికి 2018 జనవరిలో  స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్​శంకుస్థాపన చేశారు. సెంట్రల్ గవర్నమెంట్​వాటా రూ.7 కోట్లు రిలీజ్​అయినప్పటికీ స్టేట్​వాటాగా రావాల్సిన ఫండ్స్​ రిలీజ్ చేయడంలో డిలే జరుగుతోంది. ఫండ్స్ సకాలంలో రాకపోవడంతో నిర్మాణ పనులను స్లోగా సాగుతున్నాయి. దీంతో పాటు మంజూరైన బాన్సువాడలో ఎంసీహెచ్ నిర్మాణ పనులు కంప్లీట్ అయి ఏడాది నుంచి పెషేంట్లకు సేవలు అందింస్తుండగా ఇక్కడ మాత్రం ఇంకా కంప్లీట్ కావడం లేదు. బిల్డింగ్​లోపల ఫ్లోరింగ్, ఆయా విభాగాల్లో పనులు, కంపౌడ్​వాల్ పనులు జరగాల్సి ఉంది.   

మంత్రి విజిట్ చేసినా..

స్టేట్‌‌‌‌ హెల్త్ మినిస్టర్ తన్నీరు హరీశ్‌‌‌‌రావు ఆరు నెలల కింద జిల్లాకు వచ్చారు. ఇక్కడి ఆఫీసర్లతో రివ్యూ చేయడానికి ముందు ఎంసీహెచ్ బిల్డింగ్ నిర్మాణ పనులు పరిశీలించారు. త్వరగా పనులు కంప్లీట్ చేయాలని, ఫండ్స్​కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు రూ.3 కోట్లు మాత్రమే రావడంతో పనులు స్లోగానే సాగుతున్నాయి. 

డెలివరీలకు ప్రాబ్లమ్స్​

జిల్లా హాస్పిటల్‌‌‌‌లో ప్రతి నెలా 250 నుంచి 300కు పైగా డెలివరీలు జరుగుతుంటాయి. ఇందులో కొన్ని నార్మల్,  కొన్ని సీజేరియన్లు ఉంటాయి. జిల్లా హాస్పిటల్‌‌‌‌లోనే అన్ని విభాగాలు ఉన్నాయి. దశబ్దాల కింద అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్మించిన బిల్డింగ్ కావడంతో పెరిగిన పెషేంట్లు, ఇన్​పెషేంట్లతో ఇరుకుగా మారింది. ఎంసీహెచ్ బిల్డింగ్ నిర్మాణ పనులు కంప్లీట్ అయితే గైనిక్ వార్డు, చిల్ర్డన్స్​ వార్డును అక్కడకు షిఫ్ట్‌‌‌‌ చేయవచ్చు. జిల్లా హాస్పిటల్ సరిపోక డెలివరీలకు వచ్చే వారితో పాటు వారంలో మూడు రోజుల పాటు  టెస్టులకు వచ్చే గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ చూపి ఎంసీహెచ్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ను త్వరగా కంప్లీట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

వచ్చే నెలలోనే కంప్లీట్ చేస్తాం

ఎంసీహెచ్ బిల్డింగ్ నిర్మాణంలో పనులు మధ్యలో డిలే జరిగింది వాస్తవమే. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడి మళ్లీ పనులు చేయిస్తున్నాం. సెస్టెంబర్​ చివరి వరకు కంప్లీట్​ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. 

- అరవింద్, ఏఈ, హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇంజినీరింగ్ ​విబాగం