IPL 2024: అతడికే బాధ్యతలు: కెప్టెన్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2024: అతడికే బాధ్యతలు: కెప్టెన్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో పంత్ రీఎంట్రీ కంఫర్మ్ అయినప్పటికీ.. అతను ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించేది, కీపింగ్ చేసేది అనుమానంగా మారింది. పంత్ పూర్తిగా ఫిట్‌గా లేకుంటే అతన్ని కొంచెం భిన్నమైన పాత్రలో ఉపయోగించాల్సి ఉంటుందని ఆ జట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ జట్టు కెప్టెన్ ఎవరనే సస్పెన్స్ నిన్నటివరకు కొనసాగుతూనే ఉంది. అయితే మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ఉందనగా.. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నిన్న (మార్చి 19) తమ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను ప్రకటించింది.

2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన అతడు ఆ తర్వాత ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ అయిన అతడు 2023 సీజన్ ఆడలేకపోయాడు. అయితే, ఇటీవలే రిషబ్ పంత్ పూర్తిగా ఫిట్‍నెస్ సాధించాడు. దీంతో ఐపీఎల్ 2024 ఆడేందుకు రెడీ అయ్యాడు. అయితే, చాలా విరామం తర్వాత ఆడుతుండటంతో వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని అతడికి ఇస్తారా లేదా అనే టెన్షన్ నెలకొన్నా ఈ డాషింగ్ ప్లేయర్ పైనే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నమ్మకముంచి.. తనకు కెప్టెన్సీని అప్పగిస్తున్నామని అధికారికంగా ప్రకటించింది.

ALSO READ :-రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

దీంతో ఉత్కంఠకు తెరపడింది. ఓ సీజన్ గ్యాప్ తర్వాత మళ్లీ ఢిల్లీ సారథ్య బాధ్యతలను పంత్ చేపట్టనున్నాడు.వెల్‍కమ్ బ్యాక్ కెప్టెన్ రిషబ్ పంత్ అంటూ సోషల్ మీడియాలో ఢిల్లీ ఫ్రాంచైజీ పోస్ట్ చేసింది. అలాగే, ర్యూబిక్‍లతో క్యూబ్‍లతో పంత్ ముఖాన్ని తయారు చేసిన వీడియోను పోస్ట్ చేసింది. రిషబ్ మళ్లీ కెప్టెన్‍ను చేయడంతో ఢిల్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2023 సీజన్ లో పంత్ లేకపోవడంతో డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా జట్టును నడిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ ను మార్చి 23న పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది.