ఎల్జీ సాబ్‌‌ చిల్‌ అవ్వండి

ఎల్జీ సాబ్‌‌ చిల్‌ అవ్వండి

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పై  సీఎం కేజ్రీవాల్‌ సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ఎల్జీ సాబ్‌ మీరు నన్ను రోజూ తిట్టినంతగా నా భార్య కూడా తిట్టలేదు. గత ఆరు నెలలుగా ఎల్జీ సాబ్‌ రాసినన్ని ప్రేమలేఖలు నా భార్య కూడా రాయలేదు. ఎల్జీ సాబ్‌ మీరు చిల్‌ అవ్వండి.. మీ సూపర్‌ బాస్‌ని కూడా కొంచెం చిల్‌ చేయండి’’ అంటూ కేజ్రీవాల్‌ హిందీలో ట్వీట్ చేశారు.  కేజ్రీవాల్ చేసిన ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.  
 

ఢిల్లీలోని బీజేపీ పాలిత మున్సిపల్‌ బాడీల్లో రూ.6000 కోట్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాసిన మరుసటి రోజునే కేజ్రీవాల్‌ ఈ మేరకు ట్వీట్‌ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఢిల్లీ ఫ్రభుత్వం చేపడుతున్న పథకాల విషయంలో గవర్నర్ వీకే సక్సేనా, సీఎం కేజ్రీవాల్‌ మధ్య గత కొంతకాలంగా  మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే.