కాంట్రాక్ట్ టీచర్ల ఆందోళనలకు కేజ్రీవాల్ మద్దతు

కాంట్రాక్ట్ టీచర్ల ఆందోళనలకు కేజ్రీవాల్ మద్దతు

పంజాబ్‌లో ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మద్దతు పలికారు. మొహాలీలో శనివారం అక్కడి కాంట్రాక్ట్ టీచర్లు చేసిన ధర్నాలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీచర్ల డిమాండ్లపై పంజాబ్ ప్రభుత్వం స్పందించాలన్నారు. ఆరు వేల రూపాయల జీతంతో టీచర్లు పని చేస్తున్నారని, ఈ చిన్న మొత్తంతో ఎవరైనా ఎలా బతకగలరని ఆయన ప్రశ్నించారు. టీచర్ల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఆందోళన సందర్భంగా... వాటర్ ట్యాంక్ ఎక్కిన టీచర్లను దిగి రావాలని కేజ్రీ కోరారు. సమస్యలను పోరాటంతో పరిష్కరించుకోవాలని, ఎవరూ ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.