ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి..

ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి..

న్యూఢిల్లీ:ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి కలకలం రేపుతోంది. బుధవారం (ఆగస్టు 20) ఉదయం ఢిల్లీలో సివిల్ సైన్స్ లోని ఆమె అధికారిక నివాసంలో ఈ దాడి జరిగింది. వారం వారం నిర్వహించే జన్ సున్వాయ్(పబ్లిక్ హియరింగ్) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రేఖాగుప్తాపై గుర్తు తెలియన వ్యక్తి దాడి చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ బీజేపీ నేతలు ధృవీకరించారు.  

జాన్ సున్వాయి జరుగుతుంండగా 35 యేళ్ల ఓ వ్యక్తి ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి చేశారు. దాడి ఎలా జరిగింది అనేదానిపై స్పష్టత లేదు.కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాని చెంపదెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. పబ్లిక్ హియరింగ్ సందర్భంగా ఫిర్యాదు దారుడిగా నిందితుడు ఆమె నివాసంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడిని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా  తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే.. సామాన్యుల ఎలా సురక్షితంగా  ఉండగలరని  అన్నారు. 

ఢిల్లీ ప్రజలను సమస్యలను నేరుగా పరిష్కరించాలనే ఉద్దేశంతో జన్ సున్వాయ్ (పబ్లిక్ హియరింగ్ ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సీఎం రేఖాగుప్తా.