ఢిల్లీలో మాక్‌‌‌‌ డ్రిల్‌‌‌‌.. 15 నిమిషాలు కరెంట్ కట్‌‌‌‌

ఢిల్లీలో మాక్‌‌‌‌ డ్రిల్‌‌‌‌.. 15 నిమిషాలు కరెంట్ కట్‌‌‌‌
  • రాష్ట్రపతి భవన్, పీఎంవో, హాస్పిటల్స్, ఎమర్జెన్సీ సెంటర్లకు మినహాయింపు

న్యూఢిల్లీ, వెలుగు: పాకిస్తాన్‌‌‌‌పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఎదురు దాడులు జరిగే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పాక్ క్షిపణుల టార్గెట్‌‌‌‌లో ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో మరిన్ని రక్షణ చర్యలు చేపట్టింది.

 ఇందులో భాగంగా బుధవారం మాక్‌‌‌‌ డ్రిల్‌‌‌‌ చేపట్టి, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి 8:15 గంటల వరకు విద్యుత్‌‌‌‌ సరఫరాను నిలిపివేసింది. అయితే.. ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, రాష్ట్రపతి భవన్, పీఎంవో, మెట్రో స్టేషన్లు, ఇతర ముఖ్యమైన సంస్థలకు బ్లాక్ అవుట్ డ్రిల్ నుంచి మినహాయింపు ఇచ్చింది.