8 నెలల్లో 46 కిలోలు తగ్గిన సీనియర్ పోలీస్ అధికారి

8 నెలల్లో 46 కిలోలు తగ్గిన సీనియర్ పోలీస్ అధికారి

బరువు తగ్గాలని చాలా మంది అనుకుంటారు. కానీ అందుకు చేయాల్సిన పనిని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఓ పోలీస్ అధికారి మాత్రం ఎవరూ ఊహించని విధంగా బరువును తగ్గించుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 8నెలల్లో 46 కేజీల బరువు తగ్గి.. అధికారులతో గ్రేట్ అనిపించుకుంటున్నారు. ఆయనే ఢిల్లీలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ మెట్రో పోలీస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జితేంద్రమణి. 130 కిలోల బరువున్న ఆయన.. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడేవాడు. 

ఆరోగ్య సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న జితేంద్రమణి... తన జీవన శైలిని, ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకున్నాడు. రోజు 15వేల అడుగులు నడవడం, సమతుల ఆహారం తీసుకుంటూ పలు జాగ్రత్తలు పాటించాడు. జితేంద్ర కార్బోహైడ్రేడ్స్ ఎక్కువగా ఉండే అన్నానికి బదులుగా రోటీలు, సూప్, సలాడ్స్, పండ్లు తదితర పోషకాహారాన్ని తీసుకోవడం మొదలుపెట్టారు. అలా కఠిన ఆహారపు నియమాలు పాటించి కేవలం 8నెలల్లోనే తన నడుము చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్ ను 5శాతం తగ్గించుకొని 12 అంగుళాలు తగ్గారు. అలా ప్రతి నెలా 4.5 లక్షల అడుగులు నడవాలని లక్ష్యంగా పెటుకున్నానని, గత 8నెలల్లో 32 లక్షల అడుగులు నడిచానని జితేంద్ర చెప్పారు. అలా ప్రస్తుతం జితేంద్ర 84కేజీలకు చేరుకున్నారు. కాగా ఇటీవల జరిగిన ఓ వేడుకలో పోలీసు శాఖ తరపున అతనికి ప్రశంసా పత్రాన్ని అందించిన  పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా.. అతని పట్టుదలను అభినందించారు.