Women Beauty lips: పెదవుల మెరుపులు.. ఏ రంగు లిప్ స్టిక్ వేస్తే స్కిన్ టోన్ లుక్ అదిరిద్దో తెలుసా..!

Women Beauty lips:  పెదవుల మెరుపులు.. ఏ రంగు లిప్ స్టిక్ వేస్తే స్కిన్ టోన్ లుక్ అదిరిద్దో తెలుసా..!

స్కిన్​ టోన్​ కి నచ్చేలా లిఫ్​స్టిక్ రంగులను ఎంచుకోవాలి. అలాకాకుండా నచ్చిన రంగుని పూసేస్తే లుక్ అంతా పోతుంది. స్కిన్ కలర్ ని బట్టి మేకప్ ఎంచుకుంటారు. చాలామంది. కానీ లిప్ స్టిక్ దగ్గరికి వచ్చేసరికి పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ పొరపాటే లుక్ ని చెడగొడుతుంది. అలాకాకుండా ఉండాలంటే స్కిన్ టోన్​ ను బట్టి, పెదవుల సైజుని బట్టి ఇలా పదవులకు రంగులేయండి.

సైజుని బట్టి

పెదవుల సైజ్​ ను  బట్టి కూడా లిఫ్​ స్టిక్ రంగుల్లో మార్పులు చేయాలి. పై పెదవి పెద్దగా ఉంటే... బ్రైట్ కలర్ కింద పెదవికి వేసి.... అందులోనే ఇంకాస్త డార్క్ కలర్ పై పెదవికి చేయడం వల్ల పెదవులు రెండు ఒకేలా కనిపిస్తాయి.. కింద పెదవి లావుగా ఉంటే రంగులమైనా ఎంచుకోవచ్చు. కాకపోతే పై పెదవికి మధ్యలో కాస్తలైట్ చేస్తే మరింత బాగా కనిపిస్తాయి.
రెండు పెదవులు బొద్దుగా ఉంటే.. మెరిసే, పెదవుల రంగు మరింత బాగుంటుంది.. పెదవులే కాదు. దంతాల రంగు కూడా ఇక్కడ మ్యాటరంటున్నారు. బ్యూటీషియన్లు. తెల్లటి పలువరస ఉంటే ఎలాంటి రంగులైనా పర్వాలేదు. అదే పళ్లు పచ్చగా ఉంటే మాత్రం.. రోజ్ , ఆరంజ్,లైట్ రెడ్ కలర్స్ వేసుకోవచ్చు.. పర్పుల్, బ్రౌన్ రెడ్ షేడ్స్ కి దూరంగా ఉండాలి.

రంగుల ఎంపిక

స్కిన్ టోన్ బట్టి లిప్ స్టిక్ రంగు ఎంచుకోవాలి. ఫెయిర్ గా ఉంటే.. దాదాపు అన్ని రంగులూ -సూటవుతాయి. కానీ అన్నిటికంటే.. లైట్ పింక్, కోరల్, పీచ్, న్యూడ్, డస్టీ రెడ్ కలర్స్ ఏదైనా బాగుంటాయి. గోల్డ్ మెటాలిక్ కలర్ ను ట్రై చేయొచ్చు. లైట్ కలర్​  లో  ఉండే అమ్మాయిలు కూడా ఇవే రంగులను ట్రైచేసి మరింత అందంగా కనిపించొచ్చు. మీడియం తెలుపు రంగులో ఉండే అమ్మాయిలయితే... రోజ్ , రెడ్ రంగులు పెదవులను మరింత ఆకర్షణీయంగా చూపిస్తాయి. 

కాస్త రంగు తక్కువ ఉన్నవాళ్ల.. రాక్ కోరల్, డీప్ పింక్  బ్రైట్ రెడ్ వేసుకోవచ్చు. బ్రౌన్, పర్పుల్ షేడ్స్ జోలికి వెళ్లకపోవడం మంచిది. దీనివల్ల వీళ్లు మరింత నల్లగా కనిపిస్తారు. డీప్ కలర్ ఉన్నవాళ్లు.. బ్రౌన్, పర్పుల్ షేడ్స్ ఏమైనా ట్రైచేయొచ్చు కారమిల్, వైన్ రంగులో ఉండే లిప్​స్టిక్​  వీరిని ప్రత్యేకంగా చూపిస్తాయి. పాలిపోయిన పెదాలకు మెరుగులద్దేందుకు పేస్టల్, లైట్ షేడ్ లిప్​ స్టిక్​  ఎంపిక చేసుకోవచ్చు. ఈ రకం స్కిన్ ఉన్నవాళ్ళు బ్రౌన్.. రెడ్, మెరూన్ వంటి డార్క్ కలర్స్ వాడొద్దు. పేట్​ స్కిన్​ ను  కలిగిన వాళ్లకు మెటాలిక్ లిప్​ స్టిక్ సరిపడదు, మరింత పేట్ గా కనబడేలా చేస్తుంది.

మిడిల్ ఏజ్ లో ముదురు రంగులొద్దు

లిప్​ స్టిక్​ ని  బాగా ఇష్టపడేవాళ్లు ఎక్కువగా డార్క్ కలర్సే ఎంచుకుంటారు. కానీ డార్క్ కలర్స్ చిన్న వయసులో సప్పినంతగా మిడిల్ ఏజ్ వాళ్లకు నప్పవు. వయసు పెరుగుతున్న కొద్దీ పెదాల్లో ఉండే కొల్లాజన్ తగ్గిపోతుంది.
దీనివల్ల పెదవులకు సాగే గుణం తగ్గిపోతుంది. టీనేజ్ లో ఉన్నట్లు పెదవులు నిండుగా ఉండవు. సన్నగా మారిన మీ పెదవులపై ముదురు రంగులు అద్దుకుంటే మీ స్మైల్ లైన్స్ స్పష్టంగా కనిపిస్తాయి. కనుక లేక రంగులు నూడ్స్ లేదా పింక్ రంగులు వాడి పెదవులు నిండుగా కనిపించేటట్టు చేయొచ్చు. మిడిల్ ఏజ్ లో డార్క్ కలర్స్​ జోలికి వెళ్లవద్దు.. 

ఈ టిప్స్ పాటించండి

  • లిప్​  స్టిక్ వేసుకునే ముందు పెదాలను శుభ్రంగా కడిగి తేమ లేకుండా తుడవాలి.
  • పెదాలకు వెన్నతో మసాజ్ చేయాలి. 
  • లిప్ స్టిక్ వేసేందుకు ముందు వాజిలిన్ రాసుకున్నా పెదవులు మృదువుగా ఉంటాయి. పగిలిన పెదాలకు లిప్ స్టిక్ బాగుండదు. 
  • లిప్ స్టిక్ ఎంతవరకు వేసుకోవాలో లైనర్ తో మార్క్ చేసుకోవాలి.. లోపలిభాగం లైట్​ లైనర్​ తో నింపాలి. అక్కడ కొద్దిగా పౌడర్​ అద్ది మళ్లీ మొదట చేసిన విధంగా చేయాలి. 
  • పెదవులు లావుగా ఉన్నవారు లైనర్​ వేయడం మర్చిపోవద్దు. 
  • పెదవులు లావుగా ఉన్నట్లయిట్ కాస్త లోపలి వైపు గీత గీసి డార్క్ లైనర్ షేప్ వేసుకుని, లోపలి భాగం లైట్ లైనర్ తో నింపాలి. అక్కడ కొద్దిగా పాదర్ అద్ది మళ్లీ మొదట చేసిన విధంగా చేయాలి. 
  • డ్రెస్​ కు  మ్యాచ్ అయ్యే కలర్స్​ ట్రై చేయక పోవడం మంచిది. కలర్స్ వేసుకున్న తరువాత లిప్ గ్లాస్ రాయాలి. అలాగే లిప్​ స్టిక్​ తో పడుకుంటే దానిలోని రసాయనాలు పెదవులకు హాని చేస్తాయి. అందువల్ల నిద్రపోయే ముందు లిప్ స్టిక్ తీసి పడుకోవాలి.
  • నిలబడి లిప్ స్టిక్ వేసుకోవద్దు. ఎందుకంటే అలా చేస్తే చేతులు కదలుతాయి. దీంతో గీసిన లైనర్ దాటి లిపి స్టిక్ అంటుకునే అవకాశం ఉంది.
  • ఒక లిస్​ స్టిక్​  ఆరు నెలలు మించి ఉపయోగించొద్దు లిప్ స్టిక్ వేశాక పెదవులతో సరిచేయడం లాంటివి కూడా చేయకూడదు. విప్ పెన్సిల్ అవుట్ లైన్ వేసుకుని తర్వాతే లిప్ స్టిక్ వేసుకోవాలి.
  • పగటి పూట లేతగా సాయంత్రం కాస్త ఎక్కువగా లిప్ స్టిక్ వేసుకోవాలి. చలి,  వేడికి పెదవులు పొడిబారకుండా లిప్​ స్టిక్ తో కాపాడుకోవాలంటే ముందుగా పెదవులకు కొబ్బరినూనె రాయాలి. పది నిమిషాల తర్వాత వెచ్చని నీళ్లలో కాటన్ ను తడిపి పెదవులను తుడిచేయాలి. తర్వాతే లిప్​ స్టిక్ వేసుకుంటే మీ పెదవులు సున్నితంగా,ఆకర్షణీయంగా ఉంటాయి. 
  • ఏ రంగు నప్పుతుందో తెలుసుకునేందుకు రంగు పెదవులకే వేసుకోవాల్సిన
  • అవసరం లేదు. వేళ్లపై కొద్దిగా రాసుకుని పరీక్షించుకోవచ్చు. పెదవుల సహజరంగు కన్నా కాస్త ముదురు రంగులో ఉన్న లిప్​ స్టిక్ ఎంచుకోవాలి. హడావిడిగా కాకుండా. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని బాగుంటే తీసుకోవాలి.
  • కళ్లకు బాగా కొట్టొచ్చినట్లుగా మేకప్ చేసుకుని దానికి అదనంగా ముదురు రంగు లిప్ స్టిక్ ఎంచుకుంటారు కొందరు. అలా చూడటానికి బాగుండదు, పెదవులపై డార్క్ లిప్​ స్టిక్ వేసుకోవాలంటే మిగిలిన మేకప్ సాధారణంగా ఉండాలి. అప్పుడే లుక్ బాగుంటుంది.


వెలుగు, లైఫ్​