కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. మూడు రోజులు సీబీఐ కస్టడి

కేజ్రీవాల్‌కు బిగ్ షాక్..  మూడు రోజులు సీబీఐ కస్టడి

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది.  మూడు రోజుల సీబీఐ కస్టడికి అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ముందుగా కేజ్రీవాల్ ను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ కోర్టును కోరగా మూడు రోజులకు అనుమతించింది న్యాయస్థానం. కాగా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి  మనీలాండరింగ్ కేసులో ఈడీ కేసులో బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్న  కేజ్రీవాల్ ను బుధవారం సీబీఐ  అరెస్ట్ చేసింది.  అనంతరం ఆయనను కోర్టులో హాజరుపర్చగా.. కేసుకు సంబంధించి సీఎం తన వాదనలను స్వయంగా వినిపించారు. మరోవైపు ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు లభించిన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతానికి ఆయన తీహార్ జైల్లోనే ఉండాల్సి ఉంది.