ఢిల్లీలో పోలీసుల రెయిడ్స్.. 1700 కిలోల పటాకుల సీజ్

ఢిల్లీలో పోలీసుల రెయిడ్స్.. 1700 కిలోల పటాకుల సీజ్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేసి1700 కిలోల నిషేధిత బాణసంచాను సీజ్ చేశారు. ద్వారకా, రోహిణి, ఉత్తమ్ నగర్, శాస్త్రి నగర్, షాహ్‌‌ దారాలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ దాడులు చేశారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా బాణసంచా నిల్వ, అమ్మకాలను అరికట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రెయిడ్స్ నిర్వహించామని పోలీసులు తెలిపారు. ఆరుగురిని అరెస్టు చేసి 1,645కిలోల బాణసంచా, ఒక ట్రక్కును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.  ఇందులో 916 కిలోలకు పైగా నిషేధిత బాణసంచా ఉందని పేర్కొన్నారు.