ఢిల్లీలో ఆంక్షలు మరింత కఠినం

ఢిల్లీలో ఆంక్షలు మరింత కఠినం

ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ అమలు చేస్తోంది. అయినా కేసుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా వెయ్యి మందికి పైగా పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు. ఈ క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నేతృత్వంలోని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిస్థితిని సమీక్షించేందుకు భేటీ అయింది. కరోనా కట్టడికి ఆంక్షలు మరింత కఠినం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బార్లు, రెస్టారెంట్లను మూసివేయాలని, కేవలం టేక్ అవేకు మాత్రమే పర్మిషన్ ఉంటుందని ప్రకటించింది. బస్సలు, మెట్రో రైళ్లను 100శాతం సీటింగ్ కెపాసిటీతో నడపేందుకు సిద్ధమైంది. కరోనా విజృంభిస్తున్నందున ప్రైవేటు సంస్థలన్నింటినీ 100శాతం వర్క్ ఫ్రం హోంకు పరిమితం చేయాలని డీడీఎంఏ భావిస్తోంది. మరోవైపు కేసుల తీవ్రత దృష్ట్యా ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ ఉమ్మడి మీడియా సెంటర్ను సైతం మూసివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.