రిలయన్స్ క్యాపిటల్ ఫైనాన్స్ పేరుతో ఫ్రాడ్

రిలయన్స్ క్యాపిటల్ ఫైనాన్స్ పేరుతో ఫ్రాడ్
  •     ఫేక్ వెబ్ పేజ్ క్రియేట్ చేసి మోసం చేస్తున్న ఢిల్లీ గ్యాంగ్
  •     లోన్ల ఇప్పిస్తామంటూ నమ్మించి డబ్బులు వసూలు
  •     నలుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌,10 మందికి నోటీసులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌,వెలుగు: రిలయన్స్‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ పేరుతో ఫేక్ వెబ్ పేజ్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది. ఢిల్లీ కేంద్రంగా కాల్‌‌‌‌‌‌‌‌సెంటర్ నిర్వహిస్తున్న నలుగురు సభ్యుల గ్యాంగ్ ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.17 సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌,7 ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్స్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ గ్యాంగ్ రూ.5 కోట్లకు పైగా మోసాలు చేసినట్లు గుర్తించారు. కేసు వివరాలను ఏసీపీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌తో కలిసి సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రైమ్‌‌‌‌‌‌‌‌ డీసీపీ స్నేహా మెహ్ర శుక్రవారం వెల్లడించారు. హర్యానాలోని ఫరీదాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన తరుణ్ ఓజా(31), గురు చరణ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌(26), యోగేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌(29), జార్ఖండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన షహదత్ అన్సారీ ఈ నలుగురు కలిసి ఢిల్లీలో ఫేక్‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. రిలయన్స్‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీ పేరుతో ఫేక్ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేశారు. లోన్ల కోసం గూగుల్‌‌‌‌‌‌‌‌లో సెర్చ్‌‌‌‌‌‌‌‌ చేసేవారిని టార్గెట్ చేశారు. లోన్‌‌‌‌‌‌‌‌ తీసుకునేందుకు బ్రౌజ్ చేసిన వారి ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్లు సేకరించేవారు. వారికి కాల్స్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు 10మందికి పైగా టెలికాలర్స్‌‌‌‌‌‌‌‌ను నియమించారు. టెలికాలర్స్‌‌‌‌‌‌‌‌కి అనుమానం రాకుండా ఉండేందుకు నిజమైన రిలయన్స్‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీలాగా వ్యవహారాలు నడిపేవారు.సైబర్ చీటింగ్‌‌‌‌‌‌‌‌ గురించి టెలికాలర్స్‌‌‌‌‌‌‌‌కు తెలియకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. వారికి అనుమానం వచ్చేలోగా ఉద్యోగాల నుంచి తొలగించేవారు.

లోన్ శాంక్షన్ అయ్యిందంటూ ట్రాప్

ఈ గ్యాంగ్ మాటలు నమ్మినవారికి లోన్ అప్లికేషన్ ప్రొఫార్మా పంపించేవారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సహా లోన్‌‌‌‌‌‌‌‌ అమౌంట్‌‌‌‌‌‌‌‌ శాంక్షన్‌‌‌‌‌‌‌‌ వివరాలను పంపి ట్రాప్‌‌‌‌‌‌‌‌ చేసేవారు. ఆ తర్వాత లోన్ శాంక్షన్ అయ్యిందని చెప్పి.. ఇందుకోసం ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ఫీజు, జీఎస్టీ, ఇన్ కమ్ ట్యాక్స్ సహా ఇతర చార్జీలంటూ డబ్బులు వసూలు చేసేవారు. ఇలా సిటీకి చెందిన ఓ సీనియర్ సిటిజన్ నుంచి ఈ గ్యాంగ్ రూ.32 లక్షలు వసూలు చేసింది. లోన్ శాంక్షన్ అయ్యిందటూ ఫేక్ మెయిల్ పంపింది. లోన్ అమౌంట్ అకౌంట్ లో డిపాజిట్ కాకపోవడంతో బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీలో కాల్ సెంటర్ ఉన్నట్లు గుర్తించి దాడులు చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు.10 మంది టెలికాలర్స్‌‌‌‌‌‌‌‌కి నోటీసులు ఇచ్చారు. నిందితుల డేటాబేస్‌‌‌‌‌‌‌‌లో 27 మంది బాధితులను గుర్తించినట్లు డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు.