ఢిల్లీలో ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకం

V6 Velugu Posted on Jul 21, 2020

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. అర్హులకు రేషన్‌ సరుకులను ఇంటి దగ్గరకే పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టింది సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఢిల్లీ మంత్రివర్గం ఇవాళ(మంగళవారం,జులై-21) ఆవెూదించింది. ఈ పథకానికి సీఎం ఘర్‌ ఘర్‌ రేషన్‌ యోజన అని పేరు పెట్టింది. ఈ పథకం వెంటనే అమల్లోకి వచ్చేలా చర్యలను తీసుకుంటున్నామని అరవింద్‌ కేజీవ్రాల్‌ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆవెూదించినట్లు తెలిపారు. మంత్రివర్గం ఏకగ్రీవంగా ఈ పథకాన్ని ఆవెూదించిందని, మంత్రులు హర్షం వ్యక్తం చేశారని అన్నారు. నిత్యావసర సరుకుల కోసం లబ్దిదారులు రేషన్‌ షాపుల కోసం రావాల్సిన అవసరం లేదని అన్నారు. బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను లబ్దిదారుల ఇంటికే పంపిణీ చేస్తామని చెప్పారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించబోతున్నట్లు తెలిపారు సీఎం కేజీవ్రాల్‌.

Tagged Approves, delhi government, doorstep delivery, ration scheme

Latest Videos

Subscribe Now

More News