బాణసంచా తయారీ, విక్రయాలపై ఢిల్లీ సర్కార్ నిషేధం

బాణసంచా తయారీ, విక్రయాలపై ఢిల్లీ సర్కార్ నిషేధం
  • వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమలు

న్యూఢిల్లీ: రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య నియంత్రణే లక్ష్యంగా బాణసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి సోమవారం ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘చలికాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగే ప్రమాదం ఉంది. 

ఈ టైమ్​లో బాణసంచా కాల్చడం వల్ల అది మరింత తీవ్రతరమవుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల బాణసంచా ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, వినియోగంపై నిషేధం విధిస్తున్నాం. ఈ నిర్ణయంతో వాయుకాలుష్యం నుంచి ప్రజలను రక్షించవచ్చు. 

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాణసంచా విక్రయం, డెలివరీలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. ఢిల్లీలో వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమల్లో ఉంటుంది” అని తెలిపారు.