
విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ పైలట్ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చింది. ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనివర్శిటీ, యూనిసెఫ్ లు విద్యార్థుల కోసం కెరీర్ అవేర్ నెస్ సెషన్స్ ను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఢిల్లీకి చెందిన స్కిల్ వర్సిటీ , యునిసెఫ్‌లోని యువా (జనరేషన్ అన్‌లిమిటెడ్ ఇండియా) సహకారంతో ఉపాధి అవకాశాలను పొందేందుకు, విద్యార్థులు ఉద్యోగానికి సిద్ధపడడంలో సహాయం చేస్తాయని తెలిపారు. యువా స్టెప్ అప్ బానో జాబ్ రెడీ, డీఎస్‌ఈయూ విద్యార్థులు, ఢిల్లీలోని ఇతర ఉద్యోగార్ధులతో కలిసి ఫ్లైవీల్ డిజిటల్ సొల్యూషన్స్ ప్రైవేట్ ఆరు నెలల పైలట్‌ను నిర్వహిస్తోంది. ఈనెల 20 నుంచి ఈ పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నామని అధికారులు తెలిపారు.