కిలో ఉల్లి 25 రూపాయలే.. ముందే అలర్ట్ అయిన సర్కార్

కిలో ఉల్లి 25 రూపాయలే.. ముందే అలర్ట్ అయిన సర్కార్

ఉల్లి ధర పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం (ఆగస్టు 21వ తేదీ) నుంచి రాయితీపై కిలో ఉల్లిని రూ.25కే సరఫరా చేస్తుంది నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF)) .  కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే టమాటాలను విక్రయిస్తోన్న ఎన్‌సీసీఎఫ్‌.. బఫర్‌ నిల్వల నుంచి ఉల్లిని కూడా రాయితీపై ప్రజలకు విక్రయిస్తుంది. బఫర్ స్టాక్‌ను పెంచుకోవడానికి అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 మొబైల్‌ వ్యాన్లు, రెండు రిటైల్‌ దుకాణాల ద్వారా కిలో ఉల్లిని రూ.25ల చొప్పున అందిస్తాస్తున్నామని ఎన్‌సీసీఎఫ్‌ ఎండీ అనిస్ జోసెఫ్ చంద్ర చెప్పారు . ఇప్పటికే 10 వ్యాన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. మొబైల్ వ్యాన్‌లు నగరంలోని  పలు  ప్రాంతాలకు పంపబడతాయని తెలిపారు.  రిటైల్ అవుట్‌లెట్‌లు ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని చెప్పారు. 

ఉల్లిని ఆన్‌లైన్‌ ద్వారా కూడా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. హోల్‌సేల్, రిటైల్‌ మార్కెట్లలో బఫర్‌ ఉల్లిని అందించడం ద్వారా ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాలలో లభ్యత మెరుగుపడుతుందన్నారు.