సంచలన నిర్ణయం : ఉబర్, ఓలా ట్యాక్సీలకు నో ఎంట్రీ

సంచలన నిర్ణయం : ఉబర్, ఓలా ట్యాక్సీలకు నో ఎంట్రీ

ఢిల్లీలో కాలుష్య నివారణకు కీలక నిర్ణయం తీసుకుంది కేజ్రీవాల్ సర్కార్. రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంపై కేజ్రీవాల్ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. యాప్ ఆధారిత ఉబర్, ఓలా వంటి పలు రకాల ట్యాక్సీల ప్రవేశాన్ని నిషేధించింది. తద్వారా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు చర్యలు కట్టుదిట్టం చేసింది.

ఢిల్లీలో రిజిస్టర్ చేయబడిన వాహనాలు మాత్రమే నగరంలో నడపాలని.. ఇతర రాష్ట్రాలనుంచే ఏ ఒక్క వాహనం కూడా నగరంలోకి అనుమతించమని స్పష్టం చేసింది. అంతకుముందు ఢిల్లీ ప్రభుత్వం నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సరి, బేసీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం ప్రభావంపై సుప్రీంకోర్టు సందేహాలను వ్యక్తం చేసింది. సరి, బేసీ పథకం సమర్థత, సక్సెస్ ను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత పథకం అమలుపై ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.