ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభించిన సర్కార్

ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభించిన సర్కార్

ఢిల్లీ కాలుష్యం కోరల్లో నలిగిపోతోంది. నగరాన్ని గాలి కాలుష్యం నుంచి బయటపడేయటానికి అక్కడి ప్రభుత్వం చర్య చేపడుతోంది. అందులో భాగంగా ఈ ఆటోలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ రవాణా సంస్థ, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ జాయింట్ వెంచర్ లో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్‌లో 86 ఈ-ఆటోలను తీసుకురానున్నారు. దానికోసం ఢిల్లీ మెట్రో స్టేషన్స్ లో ఎలక్ట్రిక్-ఆటో-రిక్షా ఫుట్‌ప్రింట్ లను ప్రారంభించనున్నారు. 

ఈ ఆటోలను మెట్రో సంస్థ నడపనుంది. సుదూర ప్రాంతాల వెళ్లే ప్రజలు ఇతర వాహనాలపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ ఆటోలను తీసుకొస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులకు ఈజీ అవుతుంది. పొల్యూషన్ కూడా తగ్గుతుందని మెట్రో సంస్థ ఎండీ కుంద్రా వెల్లడించాడు. ఈ ఆటోలు బ్యాటరీ స్వాపింగ్ తో వస్తున్నాయి. దీనికోసం సిటీలో పలు చోట్ల ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.