టెక్ట్స్ బుక్ తీసుకురాలేదని చెంపమీద కొట్టిన టీచర్.. ఆస్పత్రి పాలైన విద్యార్థి

టెక్ట్స్ బుక్ తీసుకురాలేదని చెంపమీద కొట్టిన టీచర్.. ఆస్పత్రి పాలైన విద్యార్థి

తుక్మీర్‌పూర్ ప్రాంతంలోని ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి టెక్ట్స్ బుక్ తీసుకురాలేదన్న కోపంతో ఉపాధ్యాయుడు చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి ఆస్పత్రి పాలయ్యాడు. సీనియర్ పోలీసు అధికారి ప్రకారం, ఆగష్టు 7 న తన పాఠశాల ఉపాధ్యాయుడు చెంపదెబ్బ కొట్టిన 12 ఏళ్ల బాలుడిని చేర్చుకున్నట్లు GTB ఆసుపత్రి నుంచి పోలీసులకు సమాచారం అందింది.

విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, దయాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఆగస్టు 13న ఐపీసీ సెక్షన్‌లు 341 (తప్పుడు నిర్బంధానికి శిక్ష), 323 (గాయపరిచినందుకు శిక్ష) కింద సాదుల్ హసన్‌గా గుర్తించబడిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదైంది. పాఠశాలకు హిందీ పాఠ్యపుస్తకం తీసుకురావడం మరిచిపోవడంతో విద్యార్థిపై ఉపాధ్యాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాలుడు క్లాస్ నుంచి బయటకు వెళుతుండా.. హసన్ అతన్ని ఆపి చెంపదెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో విద్యార్థి మెడను కూడా నొక్కేశాడనిని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన తర్వాత బాలుడి పరిస్థితి విషమించడంతో, విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతని తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి, బెయిల్‌పై విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోంది.