కాంగ్రెస్ నేతలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహ్ం

కాంగ్రెస్ నేతలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహ్ం

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురుకు గోవాలో బార్​ అండ్​ రెస్టారెంట్​ ఉందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని ఢిల్లీ హైకోర్టు సోమవారం తేల్చిచెప్పింది. గోవాలో రెస్టారెంట్ బిజినెస్​కు సంబంధించి ఎలాంటి లైసెన్సులు వాళ్ల పేరు మీద జారీ కాలేదని రికార్డుల ద్వారా తెలుస్తోందని పేర్కొంది. కాంగ్రెస్​ నేతలు చెప్తున్నట్లు ఆ బార్​ అండ్​ రెస్టారెంట్​ ఓనర్​ జోయిష్ ఇరానీది కాదని స్పష్టం చేసింది. స్మృతి ఇరానీ, జోయిష్​ ఇరానీలపై కుట్రపూరితంగా ఆరోపణలు చేశారని జైరాం రమేశ్, పవన్​ ఖేరా, నెట్టా డిసౌజాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు కాంగ్రెస్​ లీడర్లపై మంత్రి స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణ సందర్భంగా జస్టిస్​ ఈ కామెంట్స్ చేశారు. మంత్రిని టార్గెట్​ చేసి, ఉద్దేశపూర్వకంగా నిందలేశారని మండిపడింది. మంత్రిపై ఆరోపణలు గుప్పిస్తూ చేసిన ట్వీట్లను కోర్టు ఆదేశించిన తర్వాత కూడా తొలగించలేదని గుర్తుచేసింది. ట్విట్టర్​ కంపెనీ ఆ ముగ్గురు నేతల ట్వీట్లను తొలగిస్తుందని భావిస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు.