
దేశ రాజధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వానికి అక్కడి హైకోర్టులో చుక్కెదురైంది. కరోనా వైరస్ విస్తరణ క్రమంలో 80 శాతం ICU పడకలను కరోనా బాధితుల కోసం రిజర్వ్ చేయాలని సూచిస్తూ.. అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం ఇటీవల ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చిన ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీచేసింది.