
న్యూఢిల్లీ, వెలుగు: రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దేశ రాజధాని జలమయమైంది. దీంతో ఢిల్లీ పరిధిలోని యమునా నది డేంజర్ లెవల్ దాటి ప్రవహిస్తోంది. నదికి ఆనుకొని ఉన్న లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఎగువ నుంచి యమునా నదిలో చేరుతున్న వరద నీటితో ఢిల్లీలోని రింగ్ రోడ్, సివిల్ లైన్స్, బేలా రోడ్, సోనియా విహార్, జమున, యమునా బజార్ వంటి ప్రాంతాలు నీట మునిగాయి.
దాదాపు 12 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. యమునా నది తీర ప్రాంతాలకు ఎవ్వరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, కొన్ని చోట్ల ప్రజల కోసం ఏర్పాటు చేసిన పలు రిలీఫ్ క్యాంప్‌లు కూడా వరద నీటిలో మునిగిపోయాయి.