మాగుంట రాఘవ భార్యకు ఈఎస్​ఐ ఆస్పత్రిలో టెస్టులు చేయండి

మాగుంట రాఘవ భార్యకు ఈఎస్​ఐ ఆస్పత్రిలో టెస్టులు చేయండి
  •  లిక్కర్​ స్కామ్​ కేసులో రాఘవ బెయిల్ పిటిషన్​పై ఢిల్లీ హైకోర్టులో విచారణ


న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన మాగుంట రాఘవరెడ్డి భార్యకు చెన్నైలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో మెడికల్ టెస్టులు చేయించి రిపోర్ట్ సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. లిక్కర్ స్కామ్​లో తీహార్​ జైలులో ఉన్న రాఘవరెడ్డి.. తన భార్య అనారోగ్యంగా ఉందని, బెయిలివ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​ సోమవారం కోర్టులో విచారణకు వచ్చింది. చెన్నైలో ఆమె చికిత్స పొందుతున్న ఈఎస్ఐసీ హాస్పిటల్​లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అభ్యంతరం లేదని రాఘవ తరఫు లాయర్​ వాదించారు. ఆమెకు వైద్య సేవలందించేందుకు రాఘవకు బెయిలివ్వాలని కోరగా, ఈడీ తరఫు లాయర్లు అభ్యంతరం తెలిపారు. వాదనలు విన్న బెంచ్​.. చెన్నైలోని ఈఎస్ఐసీ హాస్పిటల్​లో 7 రోజుల్లో రాఘవ భార్యకు హెల్త్ చెకప్​లు చేసి, రిపోర్ట్​లను ఈడీ, పిటిషనర్లకు అందజేయాలని హాస్పిటల్​ సూపరింటెండెంట్​కు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.