రేప్ కేసులో మహిళనే తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టు

రేప్ కేసులో మహిళనే తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ: తనపై రేప్ జరిగిందని ఓ మహిళ చెప్పినా నమ్మలేదు ఢిల్లీ కోర్టు.. ఆపై ఆరోపణలను ఎదుర్కొన్న అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే…బాధితురాలిగా చెప్పుకున్న మహిళ.. ప్రొఫెసర్ గా పనిచేస్తుంది. ఆమెకు కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో ఒకతను పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. దీంతో  తనకు లంచ్ ట్రీట్ ఇవ్వడానికి అతడు ఓ హోటల్ పిలిచాడని అక్కడే తనను రేప్ చేశాడని తెలిపింది ఆ మహిళ. అయితే ఈ ఘటన జనవరి 5, 2019 లో జరిగిందని చెప్పింది.

పోలీసులకు సదరు మహిళ ఫిర్యాదు ఇవ్వగా.. కేసు నమోదు చేసుకుని విచారించారు పోలీసులు. అయితే రేప్ జరిగిన 30 రోజుల తర్వాత ఆ మహిళ ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆ మహిళ సరైన సమాదానాలు ఇవ్వలేదు. జనవరిలో రేప్ జరిగితే 30 రోజుల వరకు ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదో చెప్పలేక పోయింది. ముందుగా తన మొబైల్ ను పోలీసులు విచారణ నిమిత్తం సబ్ మిట్ చేయాలని కోరగా ఆమె ఒప్పుకోలేదు. తప్పని సరై పోలీసులు ఆమె మొబైల్ ను చెక్ చేయగా.. రేప్ జరిగిందని చెప్పిన నాటి నుంచి పోలీసులకు పిర్యాదు ఇచ్చే వరకు ఆ మహిళ అతనితో 539 సార్లు మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. 24 గంటలు హై సెక్యురిటీ ఉండే హోటల్ లో రేప్ కు ప్రయత్నిస్తే అక్కడే ఉన్న అలారాన్ని ఎందుకు వాడలేదని, కాపాడమని హోటల్ సిబ్బందిని ఎందుకు కోరలేదో చెప్పలేకపోయింది. ఒక వేళ రేప్ జరిగిన తర్వత కూడా.. హోటల్ సిబ్బంది సహాయం ఎందుకు తీసుకోలేదో సమాదానం ఇవ్వలేదని చెప్పారు పోలీసులు.

విచారణ జరిపిన ట్రయల్ కోర్టు కూడా ఆమహిళ ఇచ్చిన సమాదానాలతో సంతృప్తి చెందలేదు. దీంతో  నిందితున్ని నిర్దోషిగా భావిస్తూ రిలీజ్ చేసింది. ఈ తీర్పును ప్రశ్నిస్తూ.. ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది ఆ మహిళ. ఢిల్లీ హైకోర్టు కూడా ఆమె మాటలు నమ్మేలా లేవంటూ కేసును కొట్టేసి.. నిందితున్ని నిర్దోషిగా భావిస్తూ రిలీజ్ చేసింది.