ఢిల్లీని పలకరించిన రుతుపవనాలు

ఢిల్లీని పలకరించిన రుతుపవనాలు

మండుటెండలతో అల్లాడుతున్న ఢిల్లీవాసులకు ఊరట లభించింది. దేశ రాజధాని నగరాన్ని రుతుపవనాలు పలకరించాయి. ఉదయం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఈస్ట్ కైలాష్, బురారీ, షాదారా, ఐటీఓ క్రాసింగ్, ఇండియా గేట్, బారాపుల్లా, రింగ్ రింగ్, ఢిల్లీ నోయిడా బార్డర్ ఏరియాల్లో వాన పడటంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి.

గంటల పాటు భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ జాం అయింది. ప్రగతి మైదాన్, ఢిల్లీ మీరట్ ఎక్స్ ప్రెస్ వే, పుల్ ప్రహ్లాద్ పూర్ అండర్ పాస్, జకీరా ఫ్లైఓవర్, జహంగీర్ పురి మెట్రో స్టేషన్, ఆజాద్ మార్కెట్ అండర్ పాస్ తో పాటు నోయిడా పరిసరాల్లో వర్షపు నీరు చేరడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల మోకాలు లోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

వర్షాల కారణంగా పలు ఫ్లైట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి రావాల్సిన ఎయిరిండియా విమానాన్ని అమ-ృత్ సర్కు, ఇండిగో ఫ్లైట్ను జైపూర్కు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించని కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.