శకునం చెప్పే బల్లి : డేటింగ్ యాప్ ట్రాప్ లో పడ్డ జర్నలిస్టు.. డబ్బులు మాయం

శకునం చెప్పే బల్లి : డేటింగ్ యాప్ ట్రాప్ లో పడ్డ జర్నలిస్టు.. డబ్బులు మాయం

స్కామర్‌లు, సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల, ఢిల్లీకి చెందిన ఒక జర్నలిస్ట్ బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా ఒక మహిళను కలిసిన వార్త వెలుగులోకి వచ్చింది. 'మీనింగ్ ఫుల్ కనెక్షన్' కోసం చూస్తున్నట్లు మహిళ తెలపడంతో వారు మాట్లాడటం ప్రారంభించారని అతను చెప్పాడు. డేటింగ్ కోసం వారు కలుసుకున్నప్పుడు, ఆహారం, పానీయాల కోసం అతనికి ఆర్డర్ చేసిన తర్వాత ఆమె దాన్ని మధ్యలోనే వదిలివేసిందని, ఆ తర్వాత అతను రూ. 15వేల కంటే ఎక్కువ చెల్లించాడని, ఆపై ఆమె ఎక్కడికో వెళ్లిందని చెప్పాడు.

ఈ సంఘటన గురించి జర్నలిస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో మాట్లాడాడు. అక్కడ వివరాలను అర్చిత్ గుప్తా పంచుకున్నారు. ఇది కేవలం మోసం మాత్రమే కాదు, భావోద్వేగపు వేధింపు అని అభివర్ణించారు.

బంబుల్ స్కామ్

దివ్య శర్మ అనే మహిళ (నకిలీ పేరు, తర్వాత ట్రూకాలర్ ద్వారా ఐఫియాగా గుర్తించబడింది) డేటింగ్ యాప్‌లో అర్చిత్‌తో కమ్యూనికేట్ చేయడానికి ప్రారంభించింది. మీనింగ్ ఫుల్ కనెక్షన్‌ను కనుగొనాలనే తన ఆసక్తిని వ్యక్తం చేసింది. కొంతకాలం తర్వాత, వారు పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లో ఉన్న ది రేస్ లాంజ్ అండ్ బార్ లో కలుసుకున్నారు. గుప్తా అక్కడ పానీయాలు, ఫుడ్ కోసం దాదాపు రూ.16వేలు ఖర్చు చేశాడు.

అసలేం జరిగిందంటే..

 "బంబుల్‌లో ఇప్పటి వరకు నిజమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారో లేదో చూద్దాం అని నేను అనుకున్నాను. దివ్య శర్మ (నకిలీ పేరు) అనే అమ్మాయి నన్ను సంప్రదించి, ఆమెను కలవమని కోరింది. రాజౌరి గార్డెన్‌లో కలుద్దామని ఆమె నన్ను ఒప్పించింది. ఆమె నన్ను ఒక బార్, ది రేస్ లాంజ్ అండ్ బార్‌కి తీసుకువెళ్లింది. ఆ స్థలంపై నమ్మకం లేనప్పటికీ, ఐఫ్యా (ట్రూకాలర్ ప్రకారం ఆమె అసలు పేరు) నేను అక్కడ కూర్చోమని పట్టుబట్టింది. ఆమె తన కోసం కొన్ని డ్రింక్స్ ఆర్డర్ చేసింది. నేను తాగను కావున.. నేను రెడ్ బుల్‌కి ఆర్డర్ చేసాను. ఒక హుక్కా, 2-3 గ్లాసుల వైన్, 1 వోడ్కా షాట్, చికెన్ టిక్కా, ఒక వాటర్ బాటిల్.. మొత్తం బిల్లురూ. 15,886 అయింది” అని అర్చిత్ చెప్పుకొచ్చాడు.

"బిల్లు చూసి షాక్ అయ్యాను. బిల్లు చెల్లించాను. వారి మెషీన్‌లో ఏదో సమస్య ఉండటంతో వారు నా కార్డును నాలుగుసార్లు నొక్కారు. ఆ స్థలం నుండి బయలుదేరే ముందు, నేను వాష్‌రూమ్‌కి వెళ్లి, తిరిగి రాగానే, ఆ బిల్లుని గ్రహించాను. అంతలోనే తమ్ముడు తనని తీసుకెళ్ళడానికి వస్తున్నాడని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్లిపోవాలని పట్టుబట్టింది. ఇంటికి వచ్చేసరికి ఇది మోసమని గ్రహించాను అని అర్చిత్ చెప్పాడు. ఆ తర్వాత నుంచి తన కాల్స్ తీసుకోలేదని..  అప్పుడు నేను ఒక మీడియా అవుట్‌లెట్‌లో వెతికి, ఒక కథనాన్ని కనుగొన్నానని చెప్పాడు. ఈ క్లబ్‌లు మరియు బార్‌లు అమ్మాయిలను ఎలా నియమించుకుని ఈ మోసం చేస్తున్నాయో కొందరు కంప్లయిట్స్ చేశారన్నాడు.

గుప్తా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హెల్ప్‌లైన్, సైబర్ పోలీస్ హెల్ప్‌లైన్ నుండి సహాయం కోరేందుకు చేసిన ప్రయత్నాలను అథారిటీ ప్రతిస్పందన లేకపోయింది. ఈ పోస్ట్ నేను నా డబ్బును ఎలా పోగొట్టుకున్నాను అనే దాని గురించి కాదు; ఇది చాలా మంది అబ్బాయిలను ఎలా మోసం చేస్తున్నారన్న దాని గురించి. ఇది కేవలం మోసం మాత్రమే కాదు; ఇది భావోద్వేగ వేధింపు. వారికి ఎటువంటి భయం లేదు; వారు బౌన్సర్లను నియమించుకున్నారు. అన్యాయమైన బిల్లును చెల్లించమని ప్రజలను బలవంతం చేస్తారు. ఈ రాకెట్ చాలా పెద్దది. వారు రాజౌరి గార్డెన్ ఏరియాలోని అనేక కేఫ్‌లు, క్లబ్‌లలో పనిచేస్తున్నారు అని గుప్తా తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

ALSO READ :- ఏం చేద్దాం..? : బీజేపీలో అంతర్మథనం