అతిషీ..త్రివర్ణ పతాకం ఎగరేయొద్దు: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

అతిషీ..త్రివర్ణ పతాకం ఎగరేయొద్దు: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

స్వాతంత్య్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని మంత్రి అతిషి ఎగురవేయాలని.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా తిరస్కరించారు.ఆమెకు బదులుగా హోంమంత్రి  కైలాష్ గెహ్లాట్‌ను ఆ బాధ్యతకు నామినేట్ చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఢిల్లీ ఎల్‌జీ సక్సేనా ఆగస్టు 15న జెండాను ఎగురవేసేందుకు ఢిల్లీ హోం మంత్రిని నామినేట్ చేశారు.

గత వారం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) వికె సక్సేనాకు కేజ్రీవాల్ లేఖ రాశారు. తన స్థానంలో ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో క్యాబినెట్ మంత్రి అతిషి జాతీయ జెండాను ఎగురవేస్తారని తెలిపారు. అయితే తమకు ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని ఎల్జీ కార్యాలయం పేర్కొంది. అలాగే స్వాతంత్య్ర దినోత్సవం రోజున అతిషీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తానని సక్సేనాకు రాసిన లేఖ ఢిల్లీ జైలు నిబంధనల ప్రకారం కేజ్రీవాల్‌కు మంజూరు చేసిన అధికారాలను దుర్వినియోగం చేయడమేనని తీహార్ జైలు అధికారులు కేజ్రీవాల్‌కు తెలిపారు.