దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రం కావడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పిన వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఒప్పుకోవడం లేదని ఒక కంపెనీ ఉద్యోగి సీనియర్ ఉద్యోగితో చేసిన చాటింగ్ స్క్రీన్‌షాట్ ప్రస్తుతం చర్చగా మారింది. కలుషితమైన గాలి వల్ల రెండు రోజులుగా బాగా తలనొప్పితో బాధపడుతున్నానని, అయినా కూడా ఆఫీసుకి రెగ్యులర్ గా వస్తున్నానని ఉద్యోగి చెప్పుకొచ్చాడు. తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే, ఆఫీస్ పనుల కారణంగా రోజు రాత్రి 8:45 గంటల వరకు ఉంటున్నానని కూడా చెప్పారు.
అయితే, కంటిన్యూగా పని చేస్తూనే తన ఆరోగ్య పరిస్థితి దిగజారకుండా ఉండటానికి అతను ఒక రోజు WFH కోరాడు. కానీ అతని సీనియర్ అందుకు ఒప్పుకోలేదు పైగా ప్రతి ఒక్కరూ కాలుష్యంతో బాధపడుతున్నారు, అందరు ఆఫీసుకి వస్తున్నారు.. WFH ఇవ్వడం కష్టం అని తేల్చి చెప్పాడు. వారం రోజుల నుండి మా టీం ఎయిర్ ప్యూరిఫైయర్లు కావాలని అడిగిన యాజమాన్యం ఏవేవో కారణాలు చెబుతూ తప్పించుకుంటుందని పేర్కొన్నారు. కాలుష్యం ఉద్యోగుల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్న పట్టించుకోవట్లేదని, దానికి బదులుగా ఒక రోజు సెలవు తీసుకుని పని చెయ్యి అని చెబుతున్నట్లు చెప్పారు.
దీనిపై ఒక యూజర్ సిక్ లీవ్ తీసుకోండి, పని వదిలేయండి. మీ ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యం. ఒకవేళ పని చాలా ముఖ్యమైంది అయితే, కంపెనీ వాళ్లే మీకు WFH ఇస్తారు అని అనగా.... మరొకరు మీ సీనియర్ ఆలా అనడం కరెక్ట్ కాదు అని... ఇంకొకరు సెలవు తీసుకున్నాక పని చేయకూడదు. కంపెనీ లెక్కలు ఆడిట్ చేసేటప్పుడు ఇది తెలిస్తే, మిమ్మల్ని అడుగుతారు అని అన్నారు.
ఢిల్లీలో కాలుష్యం అధికంగా ఉండడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తుండటంతో ఈ చర్చ మొదలైంది. గురువారం ఉదయం కూడా ఢిల్లీని చాలా దట్టమైన పొగ కమ్మేసింది. వరుసగా మూడో రోజు కూడా గాలి నాణ్యత చాలా ప్రమాదకరమైన స్థాయికి చేరింది. ఈ సీజన్‌లో మొదటిసారిగా మంగళవారం సాయంత్రం ఢిల్లీ గాలి నాణ్యత చాలా ప్రమాదకరమైన స్థాయికి పడిపోయింది. గాలి నాణ్యత సూచీ (AQI) 428కు చేరింది. ఈ సంవత్సరంలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి.
