
ఢిల్లీ జల్ బోర్డు నిర్ణయాలతో ఢిల్లీ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆప్ మంత్రి అతిషి ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్ సెక్రటరీ ఒత్తిడితో.. ఆర్థిక కార్యదర్శి ఆశిష్ వర్మ జల్ బోర్డు నిధులు మంజూరు చేయడం లేదని.. ఈ కారణంగా అంటువ్యాధులు ప్రబలి.. అంటువ్యాధుల ఢిల్లీగా ఏర్పడే అవకాశం ఉందన్నారు.
ఢిల్లీ ప్రభుత్వానికి ...కేంద్ర ప్రభుత్వానికి జరుగుతున్న రగడ అభివృద్దికి ఆటంకం కలుగుతుంది. పదే పదే ఆప్ ప్రభుత్వం.. బీజేపీ ఒకరినొకరు విమర్శించుకుంటున్నాయి. ఇప్పుడు ఆగస్టు నుంచి ఢిల్లీ జల్ బోర్డు నిధులును నిలివేశారని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. చీఫ్ సెక్రటరీ నిర్ణయం ప్రకారం ... ఆర్థిక కార్యదర్శి ఆశిష్ వర్మ ఆగస్టు నుంచి జల్ బోర్డు నిధులను మంజూరు చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సౌరభ భరద్వాజ్ స్థానంలో నీటిశాఖను అతిషికి కేటాయించారు. జల్ బోర్డు చర్యల వల్ల త్వరలో ఢిల్లీలో నీటికొరత ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. దీంతో ఢిల్లీలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని... దానికి బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
నిధులు విడుదల చేయాలని ఆర్థికమంత్రి లేఖ రాసినా జల్ బోర్డు అధికారులు పట్టించుకోవడంలేదని మంత్రి అతిషి అన్నారు. నిధులు విడుదల కాకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వడంలేదని.. సాధారణ ఖర్చులకు అనగా చీపుర్లు, బ్లీచింగ్ పౌడర్ లాంటివి కొనేందుకు జల్ బోర్డు నిధులు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికే కాంట్రాక్టర్లకు బకాయి ఉందని.. ఇక వారు పనిచేసేందుకు నిరాకరిస్తున్నారని తెలిపారు. జల్ బోర్డ్ అధికారులు ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో నీటికొరత ఏర్పడి.. మురికినీరు రోడ్లపై పారుతుందన్నారు. దీంతో ఢిల్లీ ప్రజలు తీవ్రంగా అంటువ్యాధులకుగురై.. అనారోగ్యం బారిన పడతారని మంత్రి అతిషి అన్నారు.